Ola Electric: నీ ఓలా తగలెయ్యా.. షోరూమ్‌కు నిప్పుబెట్టిన కస్టమర్.. రూ.8.5 లక్షలు లాస్..!
Ola Electric: ఓలా స్కూటర్ రిపేర్ రావడంతో వ్యక్తి షోరూమ్‌కి నిప్పంటించాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది.
Man sets Ola showroom on fire in Karnataka: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రతిరోజూ ప్రజలు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు దీని బ్యాటరీ గురించి ఆందోళన చెందుతున్నారు. మరి కొందరు బిల్డ్ క్వాలిటీ సరిగా లేదని చెబుతున్నారు. ఇదే సందర్భంలో ఓలా స్కూటర్‌లో తరచూ పనిచేయకపోవడంపై ఆగ్రహించిన ఓ వ్యక్తి కంపెనీ షోరూమ్‌కు నిప్పుపెట్టాడు. దీని వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా షోరూమ్ కాలిపోతున్నట్లు కనిపిస్తోంది.
సమాచారం ప్రకారం ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో జరిగింది. మీడియా కథనాల ప్రకారం ఇక్కడ నివసిస్తున్న మహ్మద్ నదీమ్ అనే యువకుడు నెల రోజుల క్రితం రూ. 1.4 లక్షల విలువైన ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. స్కూటర్ కొన్న ఒకటి రెండు రోజుల్లోనే సమస్యలు మొదలయ్యాయని నదీమ్ ఆరోపిస్తున్నారు. కొన్నిసార్లు దాని బ్యాటరీ సరిగ్గా పనిచేయదు, కొన్నిసార్లు అది స్టార్ట్ కాదుని అంటున్నాడు.
కలబురగిలోని ఓలా షోరూమ్‌ను తాను చాలాసార్లు ప్రాబ్లం గురించి వెళ్లానని నదీమ్ పేర్కొన్నాడు. అయితే ప్రతిసారీ షోరూం సిబ్బంది అతనికి హామీ మాత్రమే ఇచ్చారు కానీ అతని స్కూటర్‌కు రీపేర్ చేయలేదు. కొద్దిరోజుల తర్వాత షోరూం వారు కూడా సరిగా స్పందించడం మానేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసినా కూడా నాసిరకం స్కూటర్‌ను ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో కలత చెందిన నదీమ్ సెప్టెంబర్ 10న షోరూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ అగ్ని ప్రమాదంలో షోరూమ్‌లోని ఆరు ద్విచక్ర వాహనాలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా సుమారు రూ.8.5 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.