Tata Cheapest Car: టాటావారి అత్యంత చౌకైన కారు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..!
Tata Cheapest Car: బడ్జెట్‌లో కొత్తకారు కొనాలనుకునేవారికి టాటా మోటర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Tata Cheapest Car: బడ్జెట్‌లో కొత్తకారు కొనాలనుకునేవారికి టాటా మోటర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరలో గొప్పకారుని అందిస్తోంది. కంపెనీ 2016 సంవత్సరంలో టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారుని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇది జనాలలో బాగా పేరు సంపాదించింది. ఇప్పటి వరకు టియాగో విక్రయాలు 5 లక్షల యూనిట్లను దాటాయి. గత లక్ష వాహనాలను కేవలం 15 నెలల్లోనే విక్రయించినట్లు తెలిపింది. ధీని ధర, ఫీచర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
టియాగో కారు పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తుంది. ఇవి కాకుండా Tiago NRG స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) కూడా ఉంది. ఇది పెట్రోల్, CNG రెండు వెర్షన్లలో లభిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో టియాగో కారును కొనుగోలు చేసిన వారిలో 71 శాతం మంది తమ ఫస్ట్ కారుగా కొనుగోలు చేశారు. టియాగో విక్రయాలు 60 శాతం పట్టణ మార్కెట్‌లో ఉండగా మిగిలిన 40 శాతం గ్రామీణ మార్కెట్‌లో ఉంది. టియాగో ధర రూ.5.60 లక్షల నుంచి రూ.12.04 లక్షల వరకు ఉంది.
ధర, ఫీచర్లు
టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది CNG ఎంపికలో కూడా లభిస్తుంది. టియాగో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు 19.01 kmpl, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు 19.28 kmpl మైలేజీని అందిస్తాయి. CNG మాన్యువల్ వేరియంట్‌లు 27.28 kmpl మైలేజీని కలిగి ఉండగా CNG ఆటోమేటిక్ వేరియంట్లు 23.84 kmpl మైలేజీని అందిస్తాయి. అలాగే టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను టిగోర్ EV అని పిలుస్తారు. దీని మైలేజ్ 306 kmpl వరకు ఉంటుంది. టియాగో కారు తక్కువ ధరలో ఫీచర్ల పరంగా చాలా బాగుంటుంది. ఇందులో ABS, EBD, ఎలక్ట్రిక్ విండో ఆపరేషన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు అందించారు. ఈ కారు మంచి మైలేజీ, ఫీచర్లు, సేఫ్టీతో వస్తుంది.