Best Mileage Car: సామాన్యులకు బెస్ట్‌ ఆప్షన్.. ఫీచర్లు, మైలేజీ సూపర్..!

Best Mileage Car: చాలామంది కారు కొనాలని కలలు కంటుంటారు. కానీ ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు.

Update: 2023-12-09 09:15 GMT

Best Mileage Car: సామాన్యులకు బెస్ట్‌ ఆప్షన్.. ఫీచర్లు, మైలేజీ సూపర్..!

Best Mileage Car: చాలామంది కారు కొనాలని కలలు కంటుంటారు. కానీ ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ సామాన్యులు తక్కువ ధరలో కూడా ఒక మంచి కారు కొనవచ్చు. ఇది అందరికి అన్నివిధాలుగా నచ్చుతుంది. ఇండియన్ మార్కెట్లో చౌక ధరలో లభించే కార్లకి అధిక డిమాండ్‌ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది ప్రజలు మధ్యతరగతి వారే ఉంటారు. తక్కువ ధరలో గొప్ప ఫీచర్లతో మంచి మైలేజీని ఇచ్చే ఇలాంటి మోడల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అయితే భద్రతలో అగ్రస్థానంలో ఉన్న వాహనం ప్రస్తుతం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపేరు టాటా టియాగో. దీని గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం.

గొప్ప లక్షణాలు

ఈ టాటా కారులో బ్యాక్‌ పార్కింగ్ సెన్సార్, బ్యాక్‌ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, ABS, ప్రయాణీకుల భద్రత కోసం కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్‌ ఉన్నాయి. ఇది Apple CarPlay, Android Autoతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

శక్తివంతమైన ఇంజన్‌, అద్భుతమైన మైలేజ్

టాటా టియాగోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 86 BHP శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారులో CNG వేరియంట్ ఆప్షన్‌ కూడా ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే కంపెనీ ప్రకారం పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 19.01 కిమీ మైలేజీని ఇవ్వగా, సిఎన్‌జి వేరియంట్ కిలోకు 26.49 కిమీ మైలేజీని ఇస్తుంది.

బడ్జెట్ ధర

టాటా టియాగో సరసమైన కార్లలో ఒకటి. ఈ కారు మధ్యతరగతి వ్యక్తి బడ్జెట్‌లో వస్తుంది. వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.60 లక్షల నుంచి రూ. 8.20 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు మార్కెట్లోవ్యాగన్ఆర్, సెలెరియో, స్విఫ్ట్ లకు పోటీనిస్తుంది.

Tags:    

Similar News