Tata Punch: మారుతీ పాపులర్ మోడల్‌కు షాకిచ్చిన టాటా.. అమ్మకాల్లో టాప్-5 కార్లు ఇవే..!
ఈ ఏడాది విడుదలైన జాబితాను ఓసారి పరిశీలిస్తే.. టాటా పంచ్ 1.26 లక్షల యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది.
Tata Punch: టాటా పంచ్ (Tata punch) అమ్మకాల పరంగా దేశంలో దుమ్మురేపుతోంది. అయితే, మారుతీ సుజుకీ వేగనార్ (Maruti suzuki WagonR) చాలా కాలంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టాటా పంచ్ దాటేసింది. టాటా పంచ్ ఈ ఏడాది 7 నెలల్లో అధిక అమ్మకాలను నమోదుచేసింది. 2024 జనవరి నుంచి జులై వరకు రికార్డ్ చేసిన సేల్స్ ఆధారంగా ఆటోమార్కెట్ రీసెర్చ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది.
ఈ ఏడాది విడుదలైన జాబితాను ఓసారి పరిశీలిస్తే.. టాటా పంచ్ 1.26 లక్షల యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. ఇక మారుతీ సుజుకీ వేగనార్ 1.16 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా మూడో స్థానంలో అంటే 1.09 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ లిస్టులో 1.05 లక్షల అమ్మకాలతో మారుతీ సుజుకీ బ్రెజ్జా నాలుగో స్థానంలో నిలిచింది. మారుతీ ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లతో ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. జులై నెలలో అమ్మకాలను పరిశీలిస్తే టాటా పంచ్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయింది. ఈ నెలలో హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది.
టాటా పంచ్ అమ్మకాల్లో 47 శాతం ఈవీ, సీఎన్‌జీ వేరియంట్లు ఉన్నాయంట. వేగనార్‌లో ఇలాంటి ఆఫ్షన్స్ లేకపోవడం వల్ల అమ్మకాలు తగ్గినట్లు భావిస్తున్నారు.మారుతీ సేల్స్ టాటా మోటార్స్‌ను దాటడంలోనూ ఇదే కారణాలు పనిచేశాయని చెబుతున్నారు. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ తక్కువ ధరలో అందుబాటులో ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.