Tata Nexon : త్వరపడండి.. ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు.. టాటా నెక్సాన్ పై రూ.2.85లక్షల డిస్కౌంట్ ఆఫర్
Tata Nexon Cars Discounts: టాటా మోటార్స్ తన మోస్ట్ పాపులర్ నెక్సాన్ ఎస్‌యూవీపై ఈ నెలలో రూ.2.85 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది. 2023 మోడల్ కార్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కంపెనీకి చెందిన చాలా మంది డీలర్‌ల వద్ద Nexon 2023 మోడల్ కార్ల స్టాక్ మిగిలి ఉంది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీకి భారీ తగ్గింపులు రావడానికి ఇదే కారణం. అందుకే నెక్సాన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు మొత్తం సంవత్సరంలో ఈ డిసెంబర్ నెల బెస్ట్ టైమ్ అని కంపెనీ చెబుతోంది. ఇక నెక్సాన్ కంపెనీ మీద లభించే డిస్కౌంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.
కంపెనీ డీలర్లలో కొందరు ఇప్పటికీ నెక్సాన్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ ఇన్వెంటరీని కలిగి ఉన్నారు. ఈ ఎస్‌యూవీని స్టాక్ పూర్తిగా అమ్ముడయ్యేందుకు, కంపెనీ దానిపై 2.85 లక్షల రూపాయల వరకు భారీ తగ్గింపును ఇస్తోంది. ఇది ఎక్సేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌తో పాటు నగదు తగ్గింపును కలిగి ఉంటుంది. అయితే, 2023లో ఉత్పత్తి అయిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కార్లపై కస్టమర్లకు రూ. 2.10 లక్షల వరకు ప్రయోజనం కలిసి వస్తోంది. 2024 సంవత్సరపు నెక్సాన్ Nexon వేరియంట్‌ను బట్టి రూ. 45,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఇది ఫేస్‌లిఫ్ట్ కర్వ్ కాన్సెప్ట్‌ని పోలి ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో చాలా తక్కువ ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. ఇవి HVAC కంట్రోల్ కోసం టచ్-ఆధారిత ప్యానెల్‌ల ద్వారా భర్తీ చేశారు. కస్టమర్లకు వీలుగా సౌకర్యవంతమైన ఏసీ వెంట్స్‌ను అమర్చారు. ఇది కాకుండా, డ్యాష్‌బోర్డ్ లెదర్ ఇన్‌సర్ట్‌లు, కార్బన్-ఫైబర్ ఫినిషింగ్‌తో ఇంటీరియర్స్ డిజైన్ చేశారు.
టాప్-స్పెక్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, అదే పరిమాణంలో ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తోంది. దీనిని నావిగేషన్ కోసం కూడా ఉపయోగించకోవచ్చు. ఇతర ఫీచర్లలో 360 డిగ్రీ కెమెరా, కనెక్టింగ్ ఫీచర్స్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైర్, వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇది స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ కలిగి ఉంది, ESC, ప్రయాణీకులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX అలాగే ఎమర్జెన్సీ , బ్రేక్‌డౌన్ కాల్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించారు. ఇది 120hp శక్తిని, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 115hp పవర్, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు ఇప్పటికే ఉన్న 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMTతో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (పాడిల్ షిఫ్టర్‌లతో) ఎంపికతో కూడా అందుబాటులో ఉంటోంది.
టాటా మోటార్స్ Nexon - XE, XM, XM+, XZ+, XZ+ పాత వేరియంట్స్‌లో ఉన్న 'X'ని తొలగించింది. ఇప్పుడు Nexon ఫేస్‌లిఫ్ట్ ట్రిమ్స్ Smart, Smart+, Smart+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+ S, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ S, ఫియర్‌లెస్+ S. '+' బహుళ పీచర్లతో కూడిన ప్యాకేజీలను సూచిస్తుంది. S కూడా సన్‌రూఫ్‌ను సూచిస్తుంది. మీరు దీన్ని 6 కలర్ల ఆఫ్షన్లలో కొనుగోలు చేయవచ్చు.