New Tata Punch Launch: ఏం కారు మావా.. సరికొత్తగా వస్తున్న టాటా పంచ్.. అదిరిపోతున్న ఫీచర్లు..!

New Tata Punch Launch: టాటా మోటర్స్ పంచ్ అప్‌డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2025లో ఇది లాంచ్ కానుంది.

Update: 2024-09-13 07:48 GMT

Tata Punch 2025

New Tata Punch Launch: భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటర్స్ తన బెస్ట్ సెల్లింగ్ కారు పంచ్ అప్‌డేట్ వెర్షన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ కారు టెస్టింగ్ సమయంలో దేశీయ రోడ్లపై చాలా సార్లు కనిపించింది. టెస్టింగ్ సమయంలో లీక్ అయిన స్పై షాట్‌లను చూస్తే ఇది అనేక కొత్త ఫీచర్లతో రాబోతుందని తెలుస్తుంది. రెండవ త్రైమాసికం అంటే 2025లో కంపెనీ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉండే మార్పులు, ఫీచర్లు, తదితర వివరాలను తెలుసుకుందాం.

ఇంటెర్నెట్‌లోని సమాచారం ప్రకారం రాబోయే టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేయబడి హెడ్‌ల్యాంప్స్ కలిగి ఉంటుంది. అదే సమయంలో సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. టెయిల్ ల్యాంప్‌లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. కాంపాక్ట్ SUV విభాగంలో మరిన్ని ప్రీమియం ఫీచర్ల కోసం కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫేస్‌లిఫ్ట్ కొన్ని వేరియంట్‌లకు సన్‌రూఫ్‌ను కూడా పొందుతుందని లీక్ అయిన అప్‌డేట్‌లు నిర్ధారిస్తున్నాయిద. ఈ ఫీచర్ కొత్త అడ్వెంచర్ ఎస్, అడ్వెంచర్ + ఎస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

టాటా పంచ్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే అది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి. రాబోయే కొద్ది రోజుల్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించవచ్చని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. భారతీయ మార్కెట్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షలుగా అంచనా వేయబడింది.

టాటా పంచ్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే దానిలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 86bhp పవర్,113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లో హ్యుందాయ్ ఎక్సెటర్, సిట్రోయెన్ C3, నిస్సాన్ మాగ్నైట్‌లకు పోటీగా కొనసాగుతుంది.

Tags:    

Similar News