New Tata Nexon CNG: కొత్త టాటా సీఎన్‌జీ వచ్చేసింది.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే నంబర్ కార్ ఇదే..!
New Tata Nexon CNG: టాటా మోటార్స్ తన కొత్త నెక్సాన్ సిఎన్‌జిని విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.99 లక్షలు.
New Tata Nexon CNG: టాటా మోటార్స్ తన కొత్త నెక్సాన్ సిఎన్‌జిని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారును గతంలో 2024 భారత్ మొబిలిటీలో ప్రదర్శించారు. ఇంతకుముందు టెస్టింగ్ సమయంలో ఇది చాలాసార్లు కనిపించింది. కర్వ్ EV, కర్వ్ ICE తర్వాత టాటా మోటార్స్ Nexon CNG ని విడుదల చేసింది. Nexon CNG బేస్ ట్రిమ్ నుండి ప్రారంభమవుతుంది. ఇది ఆకర్షణీయమైన ధర వద్ద లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.99 లక్షలు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన గ్రీన్ మిషన్‌ను నెక్సాన్ CNG లాంచ్‌తో విస్తరిస్తోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి CNG కారు, ఇందులో టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంది. ఇది భారతదేశంలో ఒకేసారి నాలుటు ఫ్యూయల్ ఆప్షన్ కలిగి ఉన్న మొదటి వాహనం.
టాటా నెక్సాన్ CNG ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దీన్ని ఎనిమిది వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్ (O), Smart+, Smart+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్‌లెస్+ ఎస్. టాప్-స్పెక్ Nexon CNG ఫియర్‌లెస్+ S ఉన్నాయి. వాటి ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 14.59 లక్షలు.
టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ మొదటి టర్బో-ఛార్జ్డ్ CNG కారులో టాటా డ్యూయల్ సిలిండర్ CNG టెక్నాలజీ ఉంది. ఈ కారు 1.2L 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజన్‌పై నడుస్తున్నప్పుడు ఇది 118hp శక్తిని, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNGతో దీని పనితీరు కొద్దిగా తగ్గుతుంది. CNGతో ఇది 99 bhp శక్తిని, 170 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.
ట్విన్-సిలిండర్ i-CNG రెండు 30L సిలిండర్‌లను బూట్ ఫ్లోర్ కింద ఉంటుంది. ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. సింగిల్ సిలిండర్ యూనిట్ కంటే మెరుగైనది. ఇది లేటెస్ట్ ECU,ఫ్యూయల్ మధ్య ఆటోమేటిక్ స్విచ్‌తో వస్తుంది. ఇది నేరుగా CNG మోడ్‌లో ప్రారంభించడానికి అనుమతిస్తుంది. గ్యాస్ లీకేజీ విషయంలోiCNG టెక్నాలజీ CNG నుండి పెట్రోల్ మోడ్‌కి మారుతుంది. అదనపు భద్రత కోసం టాటా నెక్సాన్ ఇగ్నిషన్ ఆఫ్ చేయడానికి మైక్రో స్విచ్‌ను కూడా అందించారు.
టాటా నెక్సాన్ డిజైన్ పరంగా దాని పెట్రోల్, డీజిల్-ఆధారిత మోడల్‌లను పోలి ఉంటుంది. ఇది బూట్ లిడ్‌పై మాత్రమే దాని i-CNG బ్యాడ్జింగ్‌ను పొందుతుంది. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో), 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా నెక్సాన్ EV వలె ఇది ఇటీవల గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP)లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. CNG వేరియంట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ABS, EBDలతో కూడా రానుంది. ఇది కాకుండా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆటో డిమ్మింగ్ IRVMలు, రియర్ డి ఫాగర్‌తో వస్తుంది.