Tata Electric Cars Prices: టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గాయి.. కొత్త ధరలు తెలుసుకోండి..!
Tata Electric Cars Prices: రోజు రోజుకు ఇంధన ధరలు పెరగడం వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
Tata Electric Cars Prices: రోజు రోజుకు ఇంధన ధరలు పెరగడం వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల ప్రయాణం చాలా చౌకగా మారుతుంది. అంతేకాదు భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ చాలా పెరుగుతుంది. ఇప్పటికే కొన్నికార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఇటీవల ఎంజీ మోటార్స్ తన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ ధరను తగ్గించింది. తాజాగా టాటా మోటార్స్ కూడా టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ ధరలను రూ. 1 లక్ష 20 వేల వరకు తగ్గించింది.
టాటా నెక్సాన్ ఈవీ ధర
ఇప్పుడు టాటా టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 1 లక్ష 20 వేల తగ్గింపుతో పొందుతారు. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 14 లక్షల 49 వేల నుంచి ప్రారంభమవుతుంది. అయితే మరోవైపు లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ.16.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా మోటార్స్ నెక్సాన్ లాంగ్-రేంజ్ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 465 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. మరోవైపు టియాగో ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
టాటా టియాగో ఈవీ ధర
టాటా ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఎంజీ ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం కామెట్ ధర రూ.99 వేల నుంచి రూ.1 లక్షా 40 వేలకు తగ్గించారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారమెత్తిన టియాగో రూ.70 వేలు తగ్గింది. ఇప్పుడు టియాగో ఎలక్ట్రిక్ ధర రూ. 7 లక్షల 99 వేల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం టాటా మోటార్స్ పంచ్ ఎలక్ట్రిక్ మోడల్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. మునుపటిలాగే మీరు ఈ కారును రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో పొందుతారు.