Tata Curvv Launch: టాటా కర్వ్ వచ్చేసింది.. ఇక ఆ మూడు కార్లకు చుక్కలే..!

Tata Curvv Launch: టాటా కర్వ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 7న లాంచ్ చేసింది. ధర సుమారు రూ.18 నుండి 20 లక్షలు ఉండవచ్చు.

Update: 2024-08-07 10:08 GMT

Tata Curvv Launch

Tata Curvv Launch: కార్ లవర్స్ ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న టాటా మోటర్స్ తన కొత్త కూపే కర్వ్ ఎస్‌యూవీని విడుదల చేయబోతుంది. కంపెనీ పెట్రోల్, ఈవీ వేరియంట్‌లలో కొత్త కర్వ్‌ను తీసుకొస్తుంది. లాంచ్‌కు ముందే దీని ఫీచర్లు, ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ కర్వ్ ఎస్‌యూవీ ఈరోజు అంటే ఆగస్టు 7న మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే పెట్రోల్ వెర్షన్ కోసం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఇప్పుడు దీని ధర, ఫీచర్లు, మైలేజ్ తదితర వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం టాటా కర్వ్ EV పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. కానీ ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లలో వస్తుంది. ఈ ఎస్‌యూవీ ఫుల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ కర్వ్ టాటా కొత్త Acti.ev ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. V2L, V2V ఫంక్షన్లను టాటా కర్వ్ EVలో చూడవచ్చు. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్‌తో సహా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లను చూడవచ్చు. 12.3-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది.

కొత్త కర్వ్ డిజైన్‌లో మార్పులు చేయలేదు. ఇది ప్రస్తుతం Nexon EV లాగానే కనిపిస్తోంది. కర్వ్ EV ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కనెక్ట్ చేయబడిన LED DRLలు, ఫ్రంట్ బంపర్‌లో వర్టికల్ స్లాట్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ కర్వ్‌లో అందుబాటులో ఉంటాయి.ధర గురించి చెప్పాలంటే టాటా కర్వ్ ఎలక్ట్రిక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.18 నుండి 20 లక్షలు ఉండవచ్చు. ఇది MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EVలతో నేరుగా పోటీపడగలదు.

టాటా కర్వ్ త్వరలో లాంచ్ కాబోతున్న సిట్రోయెన్ బసాల్ట్‌తో నేరుగా పోటీపడుతుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.8లక్షతు. ఈ కొత్త కారులో అత్యంత సౌకర్యవంతమైన క్యాబిన్ ఉంటుంది. బసాల్ట్ ఫీచర్ల విషయానికి వస్తే వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. ఇది హై క్లాస్ ఫీల్ ఇస్తుంది. పుష్-బటన్ స్టార్ట్, బేస్ వేరియంట్‌లోని స్టీల్ వీల్స్ దీనికి స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి. కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, DRL, ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఉంది.

Tags:    

Similar News