Tata Harrier: పెట్రోల్‌తోపాటు, ఎలక్ట్రిక్ వర్షెన్‌లో రానున్న టాటా హారియర్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?
Tata Harrier: టాటా మోటార్స్ గత ఏడాది చివర్లో తన పాపులర్ మిడ్-సైజ్ SUV హారియర్ కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది.
Tata Harrier: టాటా మోటార్స్ గత ఏడాది చివర్లో తన పాపులర్ మిడ్-సైజ్ SUV హారియర్ కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారాకు పోటీగా ఉండే ఈ మోడల్ డీజిల్ ఇంజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది త్వరలో పెట్రోల్, EV వెర్షన్‌లలో రానుంది.
టాటా మోటార్స్ హారియర్ పెట్రోల్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు మాకు తెలిసింది. ఈ పెట్రోల్ వెర్షన్ 2025లో పరిచయం చేశారు. ఈ సమయంలోనే ఆటోమేకర్ SUV EV వెర్షన్‌ను కూడా ప్రారంభించనుంది. హారియర్ పెట్రోల్ వెర్షన్ రాకతో, ఇది ప్రస్తుతం పెట్రోల్ ఆప్షన్‌తో విక్రయించబడుతున్న టయోటా అర్బన్ క్రూయిజర్ హేరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాలతో పోటీపడుతుంది.
నెక్సాన్ పోర్ట్‌ఫోలియో వంటి అన్ని వెర్షన్లలో హారియర్ SUVని అందించాలని టాటా యోచిస్తోంది. నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, EV ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో CNG వెర్షన్ కూడా పరిచయం చేయబడుతుందని భావిస్తున్నారు. Nexon CNG ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడింది.