Tata Curvv: ఫుల్ ఛార్జ్‌లో 500 కిమీల మైలేజ్.. 8 సెకన్లలో 100 kmph వేగంతో సంచలనం సృష్టిస్తోన్న టాటా కార్..!

Tata Curvv Launch: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు టాటా Curvv, 15 నిమిషాల ఛార్జింగ్‌లో 150 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విశేషమేమిటంటే భారతీయ మార్కెట్లో ఇదే తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే కారు.

Update: 2024-08-22 08:51 GMT

Tata Curvv: ఫుల్ ఛార్జ్‌లో 500 కిమీల మైలేజ్.. 8 సెకన్లలో 100 kmph వేగంతో సంచలనం సృష్టిస్తోన్న టాటా కార్..!

Tata Curvv Launch: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు టాటా Curvv, 15 నిమిషాల ఛార్జింగ్‌లో 150 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విశేషమేమిటంటే భారతీయ మార్కెట్లో ఇదే తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే కారు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADASలతో సహా 60 కంటే ఎక్కువ అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారు ఐస్, EV రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ టాటా కర్వ్ ఈవీని విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని విస్తరిస్తోంది. Nexon EV, Tiago EV, పంచ్ EV, Tigor EV వంటి మోడళ్లతో, టాటా మోటార్స్ ఇప్పటికే భారతీయ EV మార్కెట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.

టాటా కర్వ్‌లో ప్రత్యేకత ఏమిటి..

2022లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తొలిసారిగా ఈ కారును ప్రదర్శించింది. అప్పటి నుంచి జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాటా కర్వ్ EV అనేక ఫీచర్లను కలిగి ఉంది. దీని డిజైన్, ఇంటీరియర్ చాలా ప్రత్యేకమైనవి.

-టాటా Curvv అతిపెద్ద ఫీచర్ దాని మైలేజీ. ఈ SUVని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

-కర్వ్ EV పరిధి 585 కి.మీ.లుగా క్లెయిమ్ చేసింది. వినియోగదారులు నిజ జీవితంలో 400-425 కిమీల మధ్య పరిధిని ఆశించవచ్చని కంపెనీ తెలిపింది.

-టాటా కర్వ్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, AC కోసం టచ్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఇది Nexon వంటి సెంటర్ కన్సోల్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జర్, స్టార్ట్-స్టాప్ బటన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

-టాటా కర్వ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. 45 kWh ప్యాక్ ఉంది. ఇది 502 కిమీ పరిధిని కలిగి ఉంటుంది. మరొకటి 585 కిమీల పరిధిని కలిగి ఉన్న 55 kWh ప్యాక్.

-టాటా కర్వీ EVలో 18 అంగుళాల చక్రాలు, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఈ వాహనంలో 500 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

-ఈ వాహనంలో 123 kWh మోటారు అమర్చబడి ఉంటుంది. దీని కారణంగా టాటా కర్వ్ కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదు.

టాటా Curvv ధర ఎంత?

టాటా మోటార్స్ మార్కెట్‌లో కర్వ్ ఈవీని రూ.17.49 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేసింది. ఇది కాకుండా, టాప్-స్పెక్ లాంగ్-రేంజ్ ఎడిషన్ ధర రూ. 21.99 లక్షలు. ఈ కూపే SUV కారు బుకింగ్ ఆగస్ట్ 12, 2024 నుంచి ప్రారంభమైంది.

Tags:    

Similar News