Kia Seltos: కియా నుంచి కొత్త సెల్టోస్.. ఈ ఫీచర్ చాలా హైలైట్

Kia Seltos: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) నెక్స్ట్ జనరేషన్ సెల్టోస్‌(Seltos) పై పని చేస్తోంది.

Update: 2024-11-12 10:22 GMT

Kia Seltos

Kia Seltos: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా నెక్స్ట్ జనరేషన్ సెల్టోస్‌పై పని చేస్తోంది. ఇటీవల ఈ రాబోయే వెహికల్ టెస్టింగ్ సమయంలో దక్షిణ కొరియాలో కనిపించింది. నివేదికల ప్రకారం.. కొత్త సెల్టోస్ మిడ్-సైజ్ SUV. ఇందులో కొత్త బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్  ఉంటుంది. గత సంవత్సరం చివర్లో కియా తన డీజిల్ మోడల్‌లను బలమైన హైబ్రిడ్‌లతో రీప్లేస్ చేయడానికి తన ప్రణాళికలను ప్రకటించింది. చాలా మటుకు ఈ కొత్త మోడల్ 2025 ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తదుపరి తరం కియా సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ, అత్యంత ముఖ్యమైన హైలైట్‌ల గురించి మాట్లాడిదే.. కంపెనీ దీనిని 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారుతో జతచేసి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లలో ఉన్న కియా నిరోలో కనిపిస్తుంది.

ఈ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ సుమారుగా 141 బీహెచ్‌పీ పవర్,  265 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ కోసం ఇది 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో ఉంటుంది. ఈ స్పెషల్ మోడల్ భారతదేశంలో ప్రారంభించిన తర్వాత మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుందా లేదా అనేది వెల్లడించలేదు. కొత్త కియా సెల్టోస్ హైబ్రిడ్ 18.1kmpl-19.8kmpl మైలేజీని అందిస్తుంది.

రాబోయే కియా సెల్టోస్ హైబ్రిడ్ గురించి మరో ముఖ్యమైన వివరాలు ఏమిటంటే ఇది E-AWD సిస్టమ్‌ను పొందచ్చు. కంపెనీ ఎలక్ట్రానిక్ ఆల్-టైమ్ AWD సిస్టమ్‌పై పని చేస్తోంది. ముందు భాగంలో కొత్త కియా సెల్టోస్ హైబ్రిడ్ టెల్లూరైడ్ లాంటి నిలువుగా పేర్చబడిన LED హెడ్‌లైట్‌లను పొందుతుంది. ఇది కొత్త సొగసైన-కనిపించే గ్రిల్‌ను కూడా పొందచ్చు. దీని వెనుక భాగంలో కొత్త LED హెడ్‌లైట్లు అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News