Skoda Kylaq: సేఫ్టీలో తిరుగులేదు.. స్కోడా కైలాక్ ఫీచర్స్ లీక్..!

Skoda Kylaq: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నవంబర్ 6వ తేదీన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUV కైలాక్‌ను అధికారికంగా విడుదల చేయబోతోంది.

Update: 2024-10-14 09:12 GMT

Skoda Kylaq

Skoda Kylaq: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా నవంబర్ 6వ తేదీన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న SUV కైలాక్‌ను అధికారికంగా విడుదల చేయబోతోంది. మార్కెట్లో స్కోడా కైలాక్ టాటా నెక్సాన్, పంచ్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3X0 వంటి SUVలతో పోటీ పడుతుంది. కంపెనీ రాబోయే Skoda Kylaq టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. స్కోడా కైలాక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ దాని డిజైన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

డిజైన్ గురించి మాట్లాడినట్లయితే కైలాక్ ట్రెడిషనల్ బాణం లోగోను భర్తీ చేసే కొత్త 'స్కోడా' అక్షరాలను పరిచయం చేస్తుంది. స్కోడా కైలాక్ కంపెనీ లైనప్‌లో కుషాక్ క్రింద ఉంటుంది. MQB AO IN ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధి చేయబడుతోంది. స్కోడా కైలక్‌లో సిగ్నేచర్ గ్రిల్, స్ప్లిట్ DRLతో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, రీడిజైన్ చేయబడిన బంపర్, ఇలాంటి టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. స్కోడా కైలాక్‌లోని 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్-అవుట్ పిల్లర్లు దాని స్పోర్టీ అప్పీల్‌ను పెంచుతాయి.

రాబోయే స్కోడా SUV కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. భారతదేశంలో విక్రయించబడుతున్న కంపెనీ స్కోడా కుషాక్. స్లావియా కుటుంబ భద్రత కోసం క్రాష్ టెస్ట్‌లో గ్లోబల్ NCAP ద్వారా 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఇప్పుడు ఇది కంపెనీ సబ్ 4 మీటర్ల SUVలో కూడా పునరావృతమవుతుంది.

రాబోయే SUV పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లతే ఇది 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 115bhp పవర్‌ని, 178Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడుతుంది. రాబోయే స్కోడా SUV ఎక్స్ షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 8 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య ఉండచ్చు.

Tags:    

Similar News