రూ. 12 కోట్లు అడిగితే 4,800 కోట్లు వచ్చాయి...
రూ. 12 కోట్లు అడిగితే 4,800 కోట్లు వచ్చాయి...
Resourceful Automobile..దిల్లీలోని ఈ టూ-వీలర్ డీలర్‌షిప్ సంస్థకు ఉన్నవి రెండే షోరూమ్స్. సంస్థ ఉద్యోగుల సంస్థ కేవలం 8 మంది. జస్ట్ 12 కోట్ల రూపాయలకు ఐపీఓ దరఖాస్తు చేస్తే ఏకంగా రూ. 4,800 కోట్లకు బిడ్స్ వచ్చాయి. అంటే, ఈ ఐపీఓ దాదాపు 400 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది.ఓ చిన్న కంపెనీ పట్ల ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో ఆసక్తి చూపడం స్టాక్ మార్కెట్‌నే ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ఆఫర్ చేసిన కంపెనీ ఓనర్ కూడా ఎందుకింత రెస్పాన్స్ వచ్చిందో చెప్పలేకపోతున్నారు.
రిసోర్స్‌ఫుల్ ఆటోమ1బైల్స్ సంస్థ 10.2 లక్షల షేర్లను 117 రూపాయల ఫిక్సెడ్ ధరతో ఆపర్ చేసింది. ఈ ఇష్యూ ఆగస్ట్ 22న ఓపెన్ అయింది. ఆ తరువాత సోమవారం ఆగస్ట్ 26న క్లోజ్ అయింది. బీఎస్‌ఈ డేటా ప్రకారం ఈ 40.8 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. అంటే దాదాపు 400 రెట్లు అన్నమాట. ఈ ఆటోమొబైల్ సంస్థకు మర్చంట్ బ్యాంకర్‌గా దిల్లీలోని స్వస్తిక ఇన్వెస్ట్‌మెంట్ వ్యవహరిస్తోంది. నిజానికి, ఈ బ్యాంక్ తమ ఐపీకు 10-20 రెట్లు బిడ్స్ రావాలనే లక్ష్యంతో పని చేసింది. ఒక చిన్న ఆటో కంపెనీకి ఈ టార్గెట్ కూడా ఎక్కువే. కానీ, దీనికి వారు ఊహించని స్పందన లభించింది.