Renault Duster 7 Seater: ఎంజీ హెక్టర్, టాటా, హ్యూందాయ్‌లకు బిగ్ షాక్.. రోడ్లపైకి వస్తోన్న 7 సీటర్ ఎస్‌యూవీ.. ఫీచర్లలో ఫస్ట్ క్లాస్ అంతే

Renault Duster7 Seater: రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ (బిగ్‌స్టర్) ఈ ఏడాది చివర్లో ప్రపంచ మార్కెట్లోకి రానుంది.

Update: 2024-07-10 13:12 GMT

Renault Duster7 Seater: ఎంజీ హెక్టర్, టాటా, హ్యూందాయ్‌లకు బిగ్ షాక్.. రోడ్లపైకి వస్తోన్న 7 సీటర్ ఎస్‌యూవీ.. ఫీచర్లలో ఫస్ట్ క్లాస్ అంతే

Renault Duster7 Seater: రెనాల్ట్ డస్టర్ ఒకప్పుడు భారతీయ మార్కెట్లో ఎంతో సంచలనం సృష్టించింది. కానీ, తర్వాత పేలవమైన అమ్మకాలు, కొత్త ఉద్గార నిబంధనల అమలు కారణంగా, ఇది 2022లో మార్కెట్ నుంచి ఉపసంహరించారు. ఇప్పుడు మరోసారి డస్టర్ సరికొత్త లుక్‌లో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. 2025లో భారతీయ రోడ్లపైకి రానున్న మూడవ తరం డస్టర్ కొన్ని ఫొటోలు ఇటీవల లీక్ అయ్యాయి. విశేషమేమిటంటే, కొత్త డస్టర్ (డాసియా బిగ్‌స్టర్ త్రీ-రో) 5 సీట్ల వెర్షన్‌తో పాటు, రెనాల్ట్ 7-సీటర్ వేరియంట్‌ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇది భారత మార్కెట్లో మహీంద్రా XUV700, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజర్, MG హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ (బిగ్‌స్టర్) ఈ ఏడాది చివర్లో ప్రపంచ మార్కెట్లోకి రానుంది. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త డస్టర్ (బిగ్‌స్టర్) స్పెయిన్‌లో టెస్ట్ చేస్తున్నారు. కొత్త డస్టర్ ఇంటీరియర్ డిజైన్ పాత డస్టర్‌లానే ఉన్నట్లు ఫొటోలు చూపిస్తున్నాయి. ఇది పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ని కలిగి ఉంది. కొత్త రెనాల్ట్ డస్టర్ 7-సీటర్ దాదాపు 4.6 మీటర్ల పొడవు ఉంటుంది (ఇది 5-సీటర్ డస్టర్ కంటే దాదాపు 300 మి.మీ పొడవు ఉంటుంది), కొంచెం ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. అంటే కొత్త డస్టర్‌కి ఎక్కువ క్యాబిన్ స్పేస్, పెద్ద బ్యాక్ డోర్లు లభిస్తాయి.

ఇంజిన్..

కొత్త డస్టర్ బహుశా పాత డస్టర్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 1.0-లీటర్ LPG, మైల్డ్ హైబ్రిడ్ సపోర్ట్‌తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.6-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్‌ని పొందవచ్చు. దీని బేస్ మోడల్‌లో ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఉంటుంది. అయితే ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుంది. బిగ్‌స్టర్ SUV బహుళ డ్రైవ్ మోడ్‌లు, 4X2 సిస్టమ్‌ను పొందుతుంది.

కొత్త డస్టర్ 2025 చివరిలో పునఃప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. దీని 5-సీటర్ వెర్షన్ మొదట పరిచయం చేయనుంది. 7-సీటర్ వెర్షన్ తరువాత వస్తుంది. బిగ్‌స్టర్ మహీంద్రా XUV700, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజర్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లతో పోటీపడనుంది.

Tags:    

Similar News