Car Starting Tips: కారు స్టార్ట్‌ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే మైలేజీ పడిపోతుంది..!

Car Starting Tips:చాలామంది డ్రైవింగ్‌ వస్తే చాలు కారు నడపొచ్చు అనుకుంటారు కానీ డ్రైవింగ్‌ ఒక్కటే సరిపోదు కారును గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Update: 2024-02-17 05:26 GMT

Car Starting Tips: కారు స్టార్ట్‌ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే మైలేజీ పడిపోతుంది..!

Car Starting Tips: చాలామంది డ్రైవింగ్‌ వస్తే చాలు కారు నడపొచ్చు అనుకుంటారు కానీ డ్రైవింగ్‌ ఒక్కటే సరిపోదు కారును గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే జేబు ఖాళీ అవుతుంది. కారును కొనుగోలు చేస్తే కచ్చితంగా దాని మెయింటనెన్స్‌ పట్టించుకోవాలి. లేదంటే కారు త్వరగా పాడవుతుంది. కొంతమంది కారు స్టార్ట్‌ చేయగానే యాక్సిలెటర్‌ను తొక్కుతూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలం ఉదయం పూట ఇలాంటి వారిని చాలామందిని గమనించవచ్చు. ఈ ఒక్క పొరపాటు వల్ల రెండు పెద్ద నష్టాలు జరుగుతాయి. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కారును స్టార్ట్ చేసిన వెంటనే రేస్ చేస్తే కారు మైలేజ్ తగ్గుతుంది. కారు మైలేజీ పడిపోవడానికి ప్రత్యక్ష కారణం ఇదే. దీనివల్ల కారు ఎక్కువ ఆయిల్‌ తాగుతుంది. దాని ప్రత్యక్ష ప్రభావం మీ జేబుపై పడుతుంది. కారును స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అధిక RPM వద్ద కోల్డ్ ఇంజిన్‌ను రేస్‌ చేయడం వల్ల ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల వాహనం మైలేజీ తగ్గుతుంది. వాహనాన్ని స్టార్ట్ చేసినప్పుడల్లా యాక్సిలరేటర్ ఎక్కువగా తొక్కడం మానుకోవాలి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

1. కారు స్టార్ట్ చేసిన తర్వాత 30 సెకన్ల పాటు ఆన్‌లో ఉంచి వెయిట్‌ చేయాలి.

2. యాక్సిలరేటర్‌ను నెమ్మదిగా నొక్కుతూ కొద్ది కొద్దిగా పెంచుతూ వేగాన్ని పెంచాలి.

3. ఇంజిన్ వేడెక్కే వరకు తక్కువ RPM వద్ద కారును నడపాలి.

మైలేజీ పడిపోవడానికి కారణాలు

టైర్ ప్రెజర్: టైర్ లో ఎల్లప్పుడు సమానమైన గాలి మెయింటెన్‌ చేయాలి. తక్కువగా ఉంటే రాపిడి పెరిగి మైలేజీ తగ్గుతుంది.

ఇంజిన్ ఆయిల్: కారును సమయానికి సర్వీస్ చేయకుంటే ఇంజిన్‌ ఆయిల్‌ఎక్కువగా తాగుతుంది. దీనివల్ల మైలేజీ తగ్గుతుంది.

Tags:    

Similar News