Car Buying Tips: కారు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే దోచుకుంటారు..!
Car Buying Tips: నేటిరోజుల్లో వాహనాల ధరలు మండిపోతున్నాయి.
Car Buying Tips: నేటిరోజుల్లో వాహనాల ధరలు మండిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పలు కంపెనీలు వినియోగదారులని రకరకాలుగా మోసం చేస్తున్నాయి. ఇంటి తర్వాత రెండవ అత్యంత ఖరీదైన వస్తువు కారు. మీరు కొత్తకారు కొనేటప్పుడు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఎటువంటి మోసాలకి గురికాకుండా గరిష్టంగా డబ్బు ఆదా చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
కారు బీమా
కారు ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర రెండూ వేర్వేరుగా ఉంటాయి. వాహనం ఆన్-రోడ్ ధరలో కొత్త కారు బీమా కూడా కలిసి ఉంటుంది. ఈ పరిస్థితిలో షోరూమ్ నుంచి కారును కొనుగోలు చేసినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే డబ్బును ఆదా చేయడానికి బీమాని బయటి నుంచి కొనుగోలు చేయడం ఉత్తమం. వివిధ కంపెనీల ఆఫర్‌లను తనిఖీ చేయండి. ఉత్తమమైన డీల్‌ను ఎంచుకోండి. ఇన్సూరెన్స్ షోరూమ్ కంటే బయటతీసుకుంటే తక్కువగా ఉంటుంది.
కారు ఆక్సెసరీస్
కారు కొనుగోలు చేసేటప్పుడు కారు డెకరేషన్‌కి సంబంధించిన చాలా వస్తువులని షోరూమ్ నుంచే కొనుగోలు చేస్తారు. రెయిన్ విజర్‌లు, సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్‌లు మొదలైనవాటిని అడిగి మరీ కొంటారు. అయితే షోరూమ్ నుంచి యాక్సెసరీలు కొనుగోలు చేయడం చాలా ఖరీదైనది. అందుకే కారు కొనుగోలు చేసిన తర్వాత మీకు నచ్చిన వస్తువులని బయటి నుంచి కొనుగోలు చేయడం వల్ల కొంత డబ్బు ఆదా చేయవచ్చు.
కారు రుణం
చాలా మంది కొత్త కారు కొనడానికి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. అయితే లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలపై దృష్టిపెట్టాలి. మీరు వివిధ బ్యాంకుల ఆఫర్‌లు,, వడ్డీరేట్లని తనిఖీ చేయాలి. అతి తక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకు అందిస్తోందో చూడాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మీరు గరిష్టంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.