Vande Bharat Metro Train: ఆహా! ఏమి హాయిలే హలా.. వందే భారత్ మెట్రో రైలు వచ్చేస్తోంది.. విమాన వేగంతో పరుగులే..!
Vande Bharat Metro Train: సెప్టెంబర్ 16న భారత తొలి వందే భారత్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీని వేగం గంటకు 250 కిమీ.
Vande Bharat Metro Train: సెప్టెంబర్ 16న భారత తొలి వందే భారత్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కొత్త వందే భారత్ మెట్రో రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్, భుజ్ మధ్య నడుస్తుంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ఇతర నగరాల్లో నడుస్తున్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఈ రైలును రూపొందించారు. ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. ఈ రైలు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 334 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని భారతీయ రైల్వే పేర్కొంది.
Vande Bharat Metro Train Schedule
షెడ్యూల్ గురించి మాట్లాడితే వందే భారత్ మెట్రో రైలు గుజరాత్‌లోని భుజ్ నుండి ఉదయం 5:50 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11:10 గంటలకు భుజ్‌కు చేరుకుంటుంది. ఈ రైలు వారానికి 6 రోజులు నడుస్తుంది. అలానే భుజ్-అహ్మదాబాద్ మార్గంలో దీనికోసం 9 స్టేషన్లను కూడా సిద్ధం చేశారు. రైలు ప్రతి స్టేషన్‌లో 2 నిమిషాల పాటు ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.
Vande Bharat Metro Train Speed
భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన వందే భారత్ మెట్రో సెమీ-హై-స్పీడ్ రైలు. ఈ రైలు వేగం గంటకు 100 నుండి 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ రైలులో ప్రయాణీకులను సౌకర్యవంతంగా ఉంచేందుకు 3x3 బెంచ్ టైప్ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ప్రయాణ సమయంలో వికలాంగ ప్రయాణీకులకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి కోసం కోచ్‌లో వీల్‌చైర్ యాక్సెస్ చేయగల టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
Vande Bharat Metro Train Facilities
రైల్వే వందే భారత్ మెట్రోలో టాక్-బ్యాక్ సిస్టమ్‌ను అందించింది. దీని ద్వారా ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్‌తో నేరుగా మాట్లాడవచ్చు. మంటలు, పొగలను గుర్తించేందుకు ఒక్కో కోచ్‌లో మొత్తం 14 సెన్సార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలు, పొగలు వచ్చినా వెంటనే కంట్రోల్ రూంకు ప్రమాదం గురించి తెలుస్తుంది.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ ఇటీవల కపుర్తలాలో రైల్ కోచ్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్ కోచ్ ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు వందే మెట్రో కోచ్ తయారీ ప్రక్రియను కూడా ఆయన పరిశీలించారు. వందే భారత్ మెట్రో రైలు ప్రస్తుతం 12 కోచ్‌లతో నడుస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా నాలుగు కోచ్‌లను సిద్ధం చేశారు. రైలు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచాలని కూడా రైల్వే యోచిస్తోంది.