Maruti Suzuki: లీటర్‌కి 23 కిమీల మైలేజీ.. కేవలం రూ.1 లక్ష చెల్లించి మారుతీ సుజుకి స్విఫ్ట్‌ని ఇంటికి తెచ్చుకోండి.. ఫీచర్లు ఇవే..!
Maruti Suzuki: 23.2 kmpl మైలేజీతో దూసుకపోయే ఓ ఎస్‌యూవీని కేవలం లక్ష రూపాయలకే ఇంటికి తెచ్చుకునే అద్భుతమైన ఆఫర్ ఒకటి వచ్చింది.
Maruti Suzuki: 23.2 kmpl మైలేజీతో దూసుకపోయే ఓ ఎస్‌యూవీని కేవలం లక్ష రూపాయలకే ఇంటికి తెచ్చుకునే అద్భుతమైన ఆఫర్ ఒకటి వచ్చింది. ఆ కారు ఏంటి, ఈ ఆఫర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మారుతీ సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. మారుతి స్విఫ్ట్ ZXI ప్లస్ అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్లలో ఒకటిగా మారింది.
ఈ వేరియంట్ ధర రూ. 8.21 లక్షలు (ఎక్స్-షోరూమ్). మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఈ పెట్రోల్ కారు మైలేజ్ అద్భుతమైనది.
ఈ మోడల్ 23.2 kmpl మైలేజీని అందిస్తుంది. మీరు కూడా కేవలం లక్ష రూపాయలకే ఈ కారుని ఇంటికి తెచ్చుకోవచ్చు. లక్ష చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒక లక్ష డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
Kardekho EMI కాలిక్యులేటర్ ప్రకారం, మీరు 5 సంవత్సరాల పాటు నెలకు రూ. 15,493 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మారుతి స్విఫ్ట్ ZXI కోసం కారు లోన్ కోసం మీరు 5 సంవత్సరాలకు వడ్డీగా రూ. 1.83 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.
మారుతి స్విఫ్ట్ ZXI ప్లస్ వేరియంట్: ZXI ప్లస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.21 లక్షలుగా ఉంది. అలాగే, ఆన్-రోడ్ ధర రూ.9,24,146 లక్షలుగా పేర్కొంది.
మీరు మారుతి స్విఫ్ట్ ZXI ప్లస్ వేరియంట్‌ను రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, మీకు రూ. 8,24,146 రుణం లభిస్తుందని Kardekho EMI కాలిక్యులేటర్ చూపిస్తోంది.
9 శాతం వడ్డీ రేటును ఊహిస్తే, మీరు 5 సంవత్సరాల పాటు నెలకు రూ. 17,108 EMIగా చెల్లించాల్సి ఉంటుంది.