Ola Roadster Electric Bike: జస్ట్.. రూ.999లకే.. ఓలా ఎలక్ట్రిక్ బైక్.. దద్దరిల్లిపోవాల్సిందే!

Ola Roadster Electric Bike: Ola రోడ్‌స్టర్‌ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ ప్రారంభమ్యాయి. ఇది ఫుల్ ఛార్జ్‌పై 248 కిమీ రేంజ్ ఇస్తుంది.

Update: 2024-09-14 14:21 GMT

Ola Roadster Electric Bike

Ola Roadster Electric Bike: OLA ఎలక్ట్రిక్ బైక్‌ను అతి త్వరలో విడుదల చేయబోతుంది.దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేసింది. Ola ఈ పోస్ట్‌తో ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది - Where power meets precision. Ola రోడ్‌స్టర్‌తో సాటిలేని పర్ఫామెన్స్ అందిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 126 కిమీ. kWh వేరియంట్ కోసం IDC సర్టిఫికేట్ 248 కిమీ. అయితే ఇప్పుడు బైక్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అందుకోసం టోకన్ అమోంట్‌గా రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Ola Roadster Electric Bike Features
ఫీచర్ల గురించి మాట్లాడితే Ola రోడ్‌స్టర్‌లో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆటో హిల్-హోల్డ్ అసిస్టెన్స్, CruTrim వాయిస్ అసిస్టెన్స్, పార్కింగ్ అసిస్ట్, గ్రూప్ నావిగేషన్, రీ-జెన్, థొరెటల్ సెన్సిటివిటీ ఉన్నాయి. అడ్జస్టబుల్ DIY మోడ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా రోడ్‌స్టర్‌లో క్రూయిజ్ కంట్రోల్, టో, థెఫ్ట్. ట్యాంపర్ ప్రొటెక్షన్, కార్నరింగ్ ABS, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, మోనోషాక్ సస్పెన్షన్, IP67 రేటెడ్ బ్యాటరీ, బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ ఉన్నాయి.

Ola Roadster Electric Bike Range
పర్ఫామెరన్స్ గురించి మాట్లాడితే రోడ్‌స్టర్ మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది - ఎకో, నార్మల్, హైపర్. దీని గరిష్ట వేగం గంటకు 126 కిమీ, 0-40 కిమీ/గం సమయం 2.2 సెకన్లు. మిడ్-స్పెక్ వేరియంట్ రేంజ్ 6 kWh వేరియంట్ కోసం IDC సర్టిఫికేట్ 248 కిమీ. అయితే వాస్తవ రైడింగ్ పరిస్థితుల్లో ఇది ఎంత వరకు వెళ్లగలదో నిర్ణయించాల్సి ఉంది.

ఓలా రోడ్‌స్టర్ మూడు వేరియంట్‌లలో వస్తుంది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో. వీటిలో, రోడ్‌స్టర్ మిడిల్ ప్రైస్ వేరియంట్, మూడు బ్యాటరీ సామర్థ్యాలలో వస్తుంది. ఇందులో 3.5 kWh వేరియంట్, 4.5 kWh వేరియంట్, 6 kWh వేరియంట్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధరలు ₹1,04,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. 4.5 kWh ధర ₹1,19,000 (ఎక్స్-షోరూమ్). 6 kWh వేరియంట్ ధర ₹1,39,999 (ఎక్స్-షోరూమ్) . 2025 మార్చిలో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. 

Tags:    

Similar News