Ola Electric Bikes: ఓలా నుంచి 4 ఎలక్ట్రిక్ బైక్‌లు.. మార్కెట్‌ను షేక్ చేయనున్న మోడల్స్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Ola Electric Bikes: ఎలక్ట్రిక్ స్కూటర్ల తర్వాత, ఓలా ఇప్పుడు మార్కెట్లోకి EV బైక్‌లను విడుదల చేయబోతోంది. ఈక్రమంలో ఓలా నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తోంది. ఈ బైక్‌లలో మొదటిది 2026 సంవత్సరంలో విడుదల కావచ్చు.
Ola Electric Motorcycles: ఓలా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓలా తొలి ఎలక్ట్రిక్ బైక్ 2026లో మార్కెట్లోకి విడుదల కానుంది. కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిలో నిమగ్నమై ఉంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కంపెనీకి 30 శాతం వాటా ఉంది. ఇప్పుడు కంపెనీ ఈ విభాగంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేయబోతోంది.
ఓలా గతేడాది ఈ నాలుగు బైక్‌లను ప్రదర్శించింది. ఓలా ఈ నాలుగు బైక్‌లు డైమండ్‌హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్,క్రూయిజర్‌లుగా పేర్కొంది.
బైక్ డెలివరీ 2026లో ప్రారంభం..
ఓలా ఎలక్ట్రిక్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లోనే డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది. ఇందులో కంపెనీ 'మేం ఈ మోటార్‌సైకిళ్లను 2026 మొదటి ఆరు నెలల్లో డెలివరీ చేయాలని భావిస్తున్నాం. మేం మోటార్‌సైకిళ్లతో పాటు మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.
ఎలక్ట్రిక్ బైక్‌ల రూపకల్పనకు పేటెంట్ మంజూరు..
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన మూడు మోటార్‌సైకిళ్ల రూపకల్పన, తొలగించగల ఎలక్ట్రిక్ బ్యాటరీ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను స్వీకరించడం ద్వారా ప్రజలు మంచి స్పందనను అందుకుంంది. Ola మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. ఇవి EV విభాగంలో కీలక మార్పుగా చెబుతున్నారు. ఈ స్కూటర్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యర్థి కంపెనీ..
Ola మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు S1 ప్రో, S1 ఎయిర్, S1. వీటిలో, S1 మూడు వేరియంట్లు అయితే ఓలా ఎలక్ట్రిక్ వాహనాలు బజాజ్ ఆటో, TVS మోటార్స్, ఏథర్ స్కూటర్లతో పోటీ పడుతున్నాయి. ఏథర్ ఇటీవలే మార్కెట్‌లో ఫ్యామిలీ స్కూటర్ రిజ్టాను విడుదల చేసింది.