Electric Bikes: ధర లక్షలోపే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 200కి.మీ.. త్వరగా కొనేయండి..!

Electric Bikes: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

Update: 2024-11-14 03:30 GMT

Electric Bikes: ధర లక్షలోపే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 200కి.మీ.. త్వరగా కొనేయండి..!

Electric Bikes: ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కస్టమర్ల ఆసక్తిని గమనించిన కంపెనీలు రోజుకో కొత్త మోడల్ బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే బడ్జెట్ రూ. 1 లక్షలో అద్భుతమైన బైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే మంచి బైకులను సొంతం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఒబెన్ ఎలక్ట్రిక్ తక్కువ ధరలో మీ కోసం ఓబెన్ రోర్ ఇజెడ్‌ను విడుదల చేసింది.

భారతదేశంలో ఓబెన్ రోర్ ఈజెడ్ ధర

ఈ బైక్‌ను మూడు వేర్వేరు వేరియంట్‌లు, మూడు విభిన్న బ్యాటరీ ఆప్షన్లలో పొందవచ్చచు. మీరు ఈ బైక్‌ను రూ. 89,999 (ఎక్స్-షోరూమ్), రూ. 1,09,999 (ఎక్స్-షోరూమ్)ధరతో కొనుగోలు చేయవచ్చు. ఒబెన్ రోర్ ఇజెడ్ బుకింగ్ ప్రారంభమైంది. రూ. 2999 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఒబెన్ రోర్ ఇజెడ్ రేంజ్

ఈ బైక్‌ను 2.6kWh, 3.4kWh, 4.4kWhబ్యాటరీ ఆఫ్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 2.6kWh వేరియంట్ పూర్తి ఛార్జ్‌తో 110 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ బైక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 45 నిమిషాలు పడుతుంది.

3.4kWh వేరియంట్ పూర్తి ఛార్జ్‌తో 140 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1.30 గంటలు పడుతుంది. 4.4kWh కలిగిన టాప్ వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 175 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటలు పడుతుంది. అన్ని వేరియంట్‌లు గరిష్టంగా గంటకు 95కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 3.3 సెకన్లలో 0 నుండి 40 వరకు వేగాన్ని అందుకుంటుంది.

1 లక్షలోపు ఎలక్ట్రిక్ బైక్‌లు

Revolt RV1 ధర: ఈ బైక్‌ను రూ. 1 లక్ష లోపు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 84,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 70కి.మీ. కంపెనీ అధికారిక సైట్ ప్రకారం, ఫుల్ ఛార్జింగ్ తో 100కిమీల రేంజ్ ఇచ్చే ఈ బైక్ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది.

ఓలా రోడ్‌స్టర్ గంటకు 124కిలోమీటర్ల గరిష్ట వేగంతో, ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ పై 200 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ 0 నుండి 40 వరకు వేగాన్ని అందుకునేందుకు 2.8 సెకన్లు పడుతుంది.

Tags:    

Similar News