New Bajaj Chetak: డిసెంబర్ 20న బజాజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. దీని ధర ఎంత అంటే..?

New Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో వేగంగా పాపులారిటీ దక్కించుకుంటుంది. అది ఇప్పుడు దేశంలోని టాప్-3 మోడల్స్‌లో ఒకటిగా చేరిపోయింది.

Update: 2024-12-07 06:48 GMT

New Bajaj Chetak: డిసెంబర్ 20న బజాజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. దీని ధర ఎంత అంటే..?

New Bajaj Chetak: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో వేగంగా పాపులారిటీ దక్కించుకుంటుంది. అది ఇప్పుడు దేశంలోని టాప్-3 మోడల్స్‌లో ఒకటిగా చేరిపోయింది. కంపెనీ ఈ స్కూటర్‌లో అనేక వేరియంట్‌లను ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీ త్వరలో తన పోర్ట్‌ఫోలియోకు నెక్ట్స్ జనరేషన్ చేతక్ ఈవీ యాడ్ చేయబోతుంది. ఈ నెల 20వ తేదీన కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ను విడుదల చేయనుంది. కంపెనీ తన ఆహ్వానాలను పంపడం ప్రారంభించింది. ఈ స్కూటర్ కొత్త ఛాసిస్, పెద్ద బూట్ స్పేస్‌తో రానుంది. అయితే దీని డిజైన్ ప్రస్తుతం ఉన్న మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, దీని ధర కూడా ఇప్పటికే ఉన్న మోడల్‌కు ఈక్వల్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

కొత్త తరం బజాజ్ చేతక్‌లో ప్రజలు కోరుకునే అన్ని ఫీచర్లను సాధ్యమైనంత వరకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం Ather Rizza, Ola S1, TVS iQube వంటి పోటీదారులు తమ ఇ-స్కూటర్లలో భారీ స్పేస్ ను అందిస్తున్నారు. బజాజ్ చేతక్‌ని కూడా ఈ ఫీచర్లతో సమానంగా తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇలా చేసేందుకు కంపెనీ కొత్త ఛాసిస్ ను డిజైన్ చేసింది. ఇది ఫ్లోర్‌బోర్డ్ కింద బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. తద్వారా ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది.

కొత్త బ్యాటరీ ప్యాక్ డిజైన్‌లో మార్పులు కూడా దాని పనితీరును పెంచుతాయి. బజాజ్ చేతక్ ప్రస్తుతం మోడల్‌పై ఆధారపడి 123 నుండి 137కిమీల వరకు క్లెయిమ్ చేయబడిన ఐడీసీ పరిధిని అందిస్తోంది. డిజైన్‌తో సహా స్కూటర్‌కు సంబంధించిన ఇతర విషయాలు అలాగే ఉండే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ మధ్యలో ఈ బైక్ ను ప్రారంభించవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,000 నుండి రూ. 1.29 లక్షల మధ్య ఉంటుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌లో 3 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి అక్టోబర్ 2024 వరకు చేతక్ ద్విచక్ర వాహన పరిశ్రమ కోసం ఓ డేటా ప్రకారం మొత్తం 3,03,621 యూనిట్లను విక్రయించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్టోబర్ 2024లో అత్యధిక నెలవారీ షిప్‌మెంట్‌లను నమోదు చేసింది. బజాజ్ చేతక్ ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. జూన్ 2024లో 2 లక్షల యూనిట్ల మార్కును దాటిన తర్వాత, బజాజ్ చేతక్ కేవలం నాలుగు నెలల్లో గత 1 లక్ష యూనిట్ల విక్రయాలను సాధించింది.

Tags:    

Similar News