Maruti Suzuki: సేల్స్‌తో దిమ్మ తిరిగే షాక్ ఇస్తోన్న మారుతి హ్యాచ్‌బ్యాక్.. చౌక ధరలో ఫిదా చేస్తోన్న స్విఫ్ట్.. ఫీచర్లు చూస్తే షోరూమ్‌కి క్యూ కట్టాల్సిందే..!
Auto Sales May 2024: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ దాని శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన మైలేజీతో మాత్రమే కాకుండా, మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌తో పోటీపడేందుకు సిద్ధమైంది.
Auto Sales May 2024: ప్రస్తుతం తక్కువ ధరలలో మెరుగైన ఫీచర్లతో అనేక కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీని కారణంగా బడ్జెట్ విభాగంలో రారాజుగా ఉన్న మారుతి వ్యాగన్ ఆర్ కూడా కఠినమైన సవాళ్లను ఎదుర్కోంటుంది. గత నెల (మే 2024) గురించి మాట్లాడితే, మారుతి స్విఫ్ట్ మరోసారి నంబర్-1 స్థానాన్ని సాధించింది.
మారుతీ సుజుకి స్విఫ్ట్ మరోసారి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గత మే 2024లో, స్విఫ్ట్ 19,339 యూనిట్లను విక్రయించింది. 17,850 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ని అధిగమించింది. కంపెనీ ఇటీవల స్విఫ్ట్ కొత్త తరం మోడల్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి స్విఫ్ట్ ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
కొత్త మారుతి స్విఫ్ట్ ఎలా ఉంది?
శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన మైలేజ్, స్టైలిష్ లుక్‌తో అప్‌డేట్ చేయబడిన మారుతి సుజుకి స్విఫ్ట్ ఇంజన్ గురించి మాట్లాడితే, ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 82bhp శక్తిని, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 24.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. స్విఫ్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 25.75 కిమీ మైలేజీని ఇస్తుందని మారుతి పేర్కొంది.
కొత్త మారుతి స్విఫ్ట్ ఫీచర్లు..
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ దాని శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన మైలేజీకి మాత్రమే కాకుండా, మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌తో పోటీపడుతుంది.
అప్‌డేట్ చేసిన మారుతి స్విఫ్ట్ క్యాబిన్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను చూడవచ్చు. ఇది కాకుండా, భద్రత కోసం, కారులో ప్రామాణిక 6-ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, వెనుక పార్కింగ్ కెమెరా వంటి అనేక ఫీచర్లు అందించింది.
ధర ఎంత?
అప్‌డేట్ చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్ ధర గురించి మాట్లాడుతూ, కొత్త స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ.6.49 లక్షల నుంచి రూ.9.64 లక్షల వరకు ఉంది.