Maruti Swift: 40 కి.మీల మైలేజీతో విడుదలకు సిద్ధమైన కొత్త మారుతీ స్విఫ్ట్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
New Gen Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్ ఐదవ తరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కొత్త స్విఫ్ట్ గ్లోబల్ డెబ్యూ అక్టోబర్‌లో జరుగుతుంది. 2024 ప్రారంభంలో (బహుశా ఫిబ్రవరి నెలలో) ఇది భారతదేశంలో విడుదల కానుంది.
New Gen Maruti Swift: మే 2005లో ప్రారంభించినప్పటి నుంచి మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాల్లో దూసుకపోతుంది. 17 సంవత్సరాలలో, ఈ హ్యాచ్‌బ్యాక్ అనేక మార్పులు చేసింది. ఎన్నో సిరీస్‌లు కూడా మార్చింది. తాజాగా డిజైన్ అప్‌డేట్‌లు, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు, బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఐదవ తరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హ్యాచ్‌బ్యాక్ తదుపరి తరం మోడల్ అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశిస్తుంది. ఇది 2024 ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభించనుంది.
ఇంజిన్ & మైలేజ్..
ఐదవ తరం స్విఫ్ట్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీతో పాటు కొత్త 1.2L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ సరికొత్త మోడల్ అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 35-40 kmpl మైలేజీని ARAI ధృవీకరించినట్లుగా అంచనాలు ఉన్నాయి. ఇటువంటి గణాంకాలతో ఇది భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్య కారుగా మారనుంది. హ్యాచ్‌బ్యాక్ దిగువ వేరియంట్‌లు ప్రస్తుతం ఉన్న 1.2L డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగే అవకాశం ఉంది. ఇది 23.76kmpl మైలేజీని అందించగలదు. ఈ యూనిట్ గరిష్టంగా 89bhp, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త స్విఫ్ట్ ఫీచర్లు..
దీని ఇంటీరియర్‌లో విస్తృతమైన మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్త 2024 మారుతీ స్విఫ్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, OTA (ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు), సుజుకి వాయిస్ అసిస్ట్‌తో కొత్త స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, HUD, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండవచ్చు.
డిజైన్ మార్పు..
కొత్త 2024 మారుతి స్విఫ్ట్ ప్రస్తుత తరం కంటే మరింత ఆకర్షణీయంగా మారింది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ బంపర్, కొత్త LED ఎలిమెంట్స్‌తో స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాక్స్ ఎయిర్ వెంట్‌లు, కొత్త బాడీ ప్యానెల్‌లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్డ్-అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి కొన్ని కీలక డిజైన్ మార్పులలో కొన్ని ఉన్నాయి.