Mini Cooper: భారత్‌లో మొదలైన మినీ కూపర్‌ బుకింగ్స్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి..!

Mini Cooper: మినీ కూపర్‌ కారుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి డిమాండ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-06-14 11:33 GMT

Mini Cooper: భారత్‌లో మొదలైన మినీ కూపర్‌ బుకింగ్స్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి..!

Mini Cooper: మినీ కూపర్‌ కారుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి డిమాండ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టన్నింగ్ లుక్స్‌తో అధునాతన ఫీచర్లతో కూడిన ఈ కారును సొంతం చేసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ధర ఎక్కువైనా వీటి అమ్మకాలు మాత్రం జోరు మీదుంటాయి. భారత్‌లో కూడా మిని కూపర్ అమ్మకాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌లో కొత్త కూపర్‌ ఎస్‌ కారును లాంచ్‌ చేసింది. డెలివరీలను త్వరలోనే ప్రారంభించనున్న ఈ కార్లకు సంబంధించి ఇప్పటికే రూ. 1 లక్ష టోకెన్‌ ఇచ్చి కారును బుక్‌ చేసుకోవాలని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారు సొంతం చేసుకోవాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌ వద్ద రూ. 1 లక్షల చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ అయిన ఈ కారు బుకింగ్స్‌ను ఇప్పుడు ప్రారంభించారు.

ఈ మినీ కూపర్‌ ఎస్‌ 3 డోర్‌ వెర్షన్‌ అని తెలుస్తోంది. ఈ కారు స్టన్నింగ్‌ లుక్స్‌తో డిజైన్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ కారులో ఆక్టాగోనల్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు వెనుక వైపు జాక్ ఇన్స్ఫైర్డ్ టెయిల్ లాంప్ వంటివి అందించారు. ఇక ఈ కారులో అధునాతన ఫీచర్లను అందించారు. పార్కింగ్ బ్రేక్‌, గేర్ సెలెక్టర్‌తో పాటు స్టార్ట్‌ స్విచ్‌ వంటి ఫీచర్లను అందించారు. మినీ కూపర్‌ ఎస్‌ కారులో 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

ఈ ఇంజన్‌ 204 హార్స్ పవర్, 300 Nm టార్క్ అందిస్తుంది. ఇక ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటో గేర్‌బాక్స్ ద్వారా పవర్ ఫ్రంట్ వీల్స్‌కు అందిస్తుంది. ఈ కారు కేవలం 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీల వేగాన్ని అందుకోగలుగుతుంది. ఈ కారు ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ కారు ధర సుమారుగా రూ. 42.70 లక్షల ఎక్స్‌ షో రూమ్‌ ప్రైజ్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. 

Tags:    

Similar News