MG Windsor EV: 331 కిలో మీటర్ల మైలేజీ.. 80 లేటెస్ట్ ఫీచర్లు.. భారత మార్కెట్‌లోకి వచ్చేసిన ఎంజీ విండ్సర్..!

MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ ఇంటిలిజెంట్ CUV విండ్సర్ EVని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 14:30 GMT

MG Windsor EV: 331 కిలో మీటర్ల మైలేజీ.. 80 లేటెస్ట్ ఫీచర్లు.. భారత మార్కెట్‌లోకి వచ్చేసిన ఎంజీ విండ్సర్..!

MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ ఇంటిలిజెంట్ CUV విండ్సర్ EVని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ SUV దాని కొత్త BaaS ప్రోగ్రామ్ కారణంగా సంచలనంగా మారింది. ఇది ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (బ్యాటరీ అద్దెతో), రూ. 13.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా పేర్కొంది.

ఈ సీయూవీని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు కేవలం రూ.11,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు. క్లే బీజ్, పెర్ల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ వంటి నాలుగు కలర్ ఆప్షన్‌లు దీనితో అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల గురించి మాట్లాడితే, దాని టాప్-ఎండ్ వేరియంట్ ఎసెన్స్‌లో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

విండ్సర్ EV వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఎక్సైట్: రూ. 13.5 లక్షలు (బ్యాటరీ అద్దెతో రూ. 9.99 లక్షలు)

ఎక్స్‌క్లూజివ్: రూ. 14.5 లక్షలు (బ్యాటరీ అద్దెతో రూ. 10.99 లక్షలు)

ఎసెన్స్: రూ. 15.5 లక్షలు (బ్యాటరీ అద్దెతో రూ. 11.99 లక్షలు)

విండ్సర్ అన్ని వేరియంట్‌లు 38kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇది పూర్తి ఛార్జ్‌పై 331 కిమీల మైలేజీని అందిస్తుంది. ఈ సెటప్‌తో, విండ్సర్ EV 134bhp శక్తిని, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tags:    

Similar News