MG Hector Discount: కారు కావాలా నాయనా.. MG మోటార్స్ పాపులర్ ఎస్‌యూవీపై రూ.3 లక్షల డిస్కౌంట్..!

MG Hector Discount: MG మోటార్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ హెక్టర్‌పై ఆగస్టులో బంపర్ డిస్కౌంట్ అందిస్తుంది. కొనుగోలు చేస్తే రూ.3 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది.

Update: 2024-08-27 12:26 GMT

MG Hector Discount

MG Hector Discount: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో SUV విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం Q1లో మొత్తం కార్ల అమ్మకాలలో SUV సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో మీరు కూడా కొత్త SUVని కొనుగోలు చేయాలని చూస్తుంటే మీకో గొప్ప శుభవార్త ఉంది. MG మోటార్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ హెక్టర్‌పై ఆగస్టులో బంపర్ డిస్కౌంట్ అందిస్తుంది. మీరు ఈ నెలలో హెక్టార్ కొనుగోలు చేస్తే రూ.3 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపులు కూడా ఉన్నాయి. మరింత సమచారం కోసం సమీప డీలర్షిప్‌ను కాంటాక్ట్ అవచ్చు. ఎమ్‌జీ హెక్టార్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

MG హెక్టర్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే వినియోగదారులు MG హెక్టర్‌లో 2 ఇంజన్‌లు ఉంటాయి. మొదటిది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 143bhp పవర్, 250Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేయగలదు. ఇది కాకుండా కారులో రెండవ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 170bhp పవర్‌ని, 350Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేయగలదు. SUV డీజిల్ వేరియంట్‌లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది.

అయితే పెట్రోల్ ఇంజన్‌తో 8 స్పీడ్ CBT గేర్‌బాక్స్ ఉంది. MG హెక్టర్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్‌ ఉన్నాయి.

ఇది కాకుండా కస్టమర్ల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో కూడిన టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా కారులో అందించబడ్డాయి. భారతీయ మార్కెట్లో MG హెక్టర్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 13.99 లక్షల నుండి రూ. 22.24 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News