Maybach GLS 600: 4.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీల వేగం.. గంటకు 220కిమీలు.. 9 గేర్లతో వచ్చిన మెర్సిడెస్ కార్..!
Maybach GLS 600: Mercedes-Benz మేబ్యాక్ GLS 600 కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది.
Maybach GLS 600: Mercedes-Benz మేబ్యాక్ GLS 600 కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, పవర్ ఫుల్ ఫీచర్లతో కూడిన ఈ కారు ప్రారంభ ధరను రూ.3.35 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అప్‌డేట్ చేసిన మేబ్యాక్ GLSలో కంపెనీ కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను అందించింది.
క్యాబిన్ ఎలా ఉంది:
మేబ్యాక్ GLS 600 క్యాబిన్‌లో కూడా కంపెనీ కాస్మెటిక్ మార్పులు చేసింది. అయినప్పటికీ, సాఫ్ట్‌వేర్, ట్రిమ్ ఎంపికలపై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టింది. కొత్త స్టీరింగ్ వీల్, కొత్తగా రూపొందించిన AC వెంట్, లేటెస్ట్ జనరేషన్ MBUX సాఫ్ట్‌వేర్, కొత్త గ్రాఫిక్స్ ఈ కారును మరింత మెరుగ్గా మార్చాయి. కొన్ని అదనపు ఫీచర్లలో ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీనితో, వినియోగదారు కేవలం ఒక టచ్‌తో కొన్ని ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు.
కారు వెనుక సీటు వెంటిలేషన్, కంఫర్ట్ ఫంక్షన్‌తో అందించింది. ఈ సీటు 43.5 డిగ్రీల వరకు వంగి ఉండగలదని కంపెనీ తెలిపింది. ఇది సుదూర ప్రయాణాలలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. మెర్సిడెస్‌లో బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, MBUX హై-ఎండ్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, హై-బీమ్ అసిస్ట్‌తో మల్టీబీమ్ LED, థర్మల్, నాయిస్ ఇన్సులేషన్‌తో కూడిన గార్డ్ 360-డిగ్రీ బర్గ్లరీ-రెసిస్టెంట్ లామినేటెడ్ సేఫ్టీ గ్లాస్, కంఫర్ట్ ప్యాకేజీ, అప్‌గ్రేడ్ పార్కింగ్ సిస్టమ్, వంటి ఫీచర్లు ఉన్నాయి. పార్కింగ్ జెన్ 5.0, అప్‌గ్రేడ్ స్టీరింగ్ వీల్ అందించింది.
శక్తి, పనితీరు..
GLS 600లో, కంపెనీ 4.0 లీటర్ సామర్థ్యం గల ట్విన్ టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ని అందించింది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి ఉంటుంది. ఈ ఇంజన్ 557 హెచ్‌పి పవర్, 770 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే 48V ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ ఈ ఇంజన్‌కి 22hp అదనపు శక్తిని, 250Nm టార్క్‌ను అందిస్తుంది. దీని కారణంగా ఈ కారు మరింత శక్తివంతమైనది. కంపెనీ ఈ ఇంజిన్‌ను 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జత చేసింది. ఇది అన్ని చక్రాలలో 4మ్యాటిక్ సిస్టమ్‌తో అమర్చబడింది.
ఈ కారు కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీలు. GLS 600లో అడాప్టివ్ డంపర్‌లు ప్రామాణికంగా అందించింది. ఇది కాకుండా, ఈ కారు అందాన్ని మెరుగుపరచడానికి, వెనుక ఆప్రాన్‌పై అలంకారమైన ట్రిమ్, బ్లాక్ క్రోమ్ AMG ట్విన్ టెయిల్‌పైప్స్, హీట్-ఇన్సులేటింగ్ డార్క్ టింటెడ్ గ్లాస్ అందించింది.