Mercedes-Benz: ఈ కార్లను త్వరగా కొనండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది
Mercedes-Benz: జనవరి 1, 2025 నుండి, Mercedes GLC క్లాస్ ధర రూ. 2 లక్షలు పెరగనుంది. Mercedes Maybach S 680 లగ్జరీ లిమోసిన్ ధర రూ. 9 లక్షలు పెరుగుతుంది.
Mercedes-Benz: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) తన వాహనాల ధరలను జనవరి 1, 2025 నుండి పెంచబోతున్నట్లు తెలిపింది. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలు 3 శాతం మేర పెరగనున్నాయని కంపెనీ వెల్లడించింది. వాహనాల ధరలు పెరగడానికి గల ప్రధాన కారణాలను కూడా కంపెనీ వివరించింది. ఖర్చుల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడి, అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని మెర్సిడెస్ తెలిపింది. భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల ధరలు రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పెరుగుతాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన ప్రకటనలో పేర్కోంది.
జనవరి 1, 2025 నుండి, Mercedes GLC క్లాస్ ధర రూ. 2 లక్షలు పెరగనుంది. Mercedes Maybach S 680 లగ్జరీ లిమోసిన్ ధర రూ. 9 లక్షలు పెరుగుతుంది. మెర్సిడెస్-బెంజ్ ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. గత మూడు త్రైమాసికాలుగా, మేము మా ఖర్చు నిర్మాణంపై పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నాము. ప్రధానంగా ముడిసరుకు ధరలు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల వ్యాపార స్థిరత్వం కోసం ధరలను స్వల్పంగా పెంచామని తెలిపారు.
అక్టోబర్ 2024లో మెర్సిడెస్-బెంజ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. పండుగల సీజన్ కారణంగా అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 1792 వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో మెర్సిడెస్ బెంజ్ 1374 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెర్సిడెస్ బెంజ్ మొత్తం 1308 వాహనాలను విక్రయించింది. మరోవైపు భారతదేశంలో Mercedes-Benzప్రధాన ప్రత్యర్థి అయిన BMW, అక్టోబర్ 2024లో మొత్తం 1475 వాహనాలను విక్రయించింది. గత ఏడాది అక్టోబర్‌లో బిఎమ్‌డబ్ల్యూ మొత్తం 1165 వాహనాలను విక్రయించింది.