New Gen Maruti Dzire: టైమ్ ఆగయా.. కొత్త డిజైన్, ఫీచర్లతో డిజైర్.. దీని స్పీడ్ ముందు కష్టమే..!
New Gen Maruti Dzire: మారుతి కొత్త తరం డిజైర్‌ను అప్‌గ్రేడ్ ఫీచర్లతో లాంచ్ చేయనుంది. ఇది 82 PS పవర్, 112 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
New Gen Maruti Dzire: మారుతీ సుజికీ కొత్త జనరేషన్ స్విఫ్ట్ ఇండియాలో సూపర్ హిట్ అయింది. కొత్త మోడల్ దాని అమ్మాకాలు పెంచకడమే కాకుండా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా కూడా అవతరించింది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించిన మారుతీ మొదటి హ్యాచ్‌బ్యాక్ కూడా ఇదే. ఇది హైబ్రిడ్ ఇంజన్‌తో బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడే ఇవే ఫీచర్లతో కొత్త తరం డిజైర్ కూడా దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీన్ని అనేక సార్లు టెస్ట్ చేశారు. పూణేలో ARAI-పరీక్ష సందర్భంగా మరోసారి ఇది కనిపించింది. ఇది దేశంలోనే నంబర్-1 సెడాన్ కారు. ఇది సెడాన్ సెగ్మెంట్‌లో 45 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీని ప్రస్తుత మోడల్ ప్రారంభ ధర రూ.6.57 లక్షలు.
కంపెనీ కొత్త డిజైర్‌లో 4వ తరం స్విఫ్ట్ నుండి అనేక ఫీచర్లు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే కొత్త డిజైర్ మరింత ప్రీమియం లైటింగ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో LED రిఫ్లెక్టర్ బారెల్, మధ్యలో LED DRL ఉంటాయి. దిగువన హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. సొగసైన హెడ్‌ల్యాంప్ యూనిట్ 4వ తరం స్విఫ్ట్ కంటే ఎక్కువ ప్రీమియం వైబ్‌లను అందిస్తుంది. కొత్త డిజైర్‌లోని ఇతర ఫీచర్లు స్టైలింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉండవచ్చు. 4వ తరం స్విఫ్ట్‌తో పోలిస్తే ఫ్రంట్ గ్రిల్, బంపర్, బానెట్‌లలో మార్పులు ఉండవచ్చు. అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్‌తో సైడ్ ప్రొఫైల్ మెరుగ్గా ఉంటుంది.
New Gen Maruti Dzire Features, Specifications
తదుపరి తరం డిజైర్ కొత్త స్విఫ్ట్ హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రానుంది. దీనితో పాటు రెండు కార్ల మధ్య అనేక భాగాలు కూడా భాగస్వామ్యం చేయబడతాయి. కొత్త స్విఫ్ట్‌లో కంపెనీ కొత్త 1.2-లీటర్ 3 సిలిండర్ నాచురల్ ఆస్పిరేటెడ్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది 82 PS పవర్, 112 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 సిలిండర్ K సిరీస్ యూనిట్‌ను రీప్లేస్ చేసింది. కొత్త ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5 స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. డిజైర్ ఇంజిన్ ఫీచర్లు కూడా అలాగే ఉంటాయి.
కొత్త స్విఫ్ట్ గురించి కంపెనీ తన పెట్రోల్ MT వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 24.8 కిమీ, పెట్రోల్ AMT మైలేజ్ లీటర్‌కు 25.75 కిమీ అని పేర్కొంది. దీనితో పోలిస్తే డిజైర్ మైలేజ్ కొంచెం తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే కంపెనీ పెట్రోల్‌తో పాటు డిజైర్, CNG వేరియంట్‌ను కూడా విడుదల చేయగలదని కూడా భావిస్తున్నారు.
కొత్త డిజైర్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, క్రూయిజ్ వంటి కొత్త స్విఫ్ట్ ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. కంట్రోల్స్‌లో ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ORVMలు, LED హెడ్‌లైట్‌లు, LED టెయిల్‌లైట్‌లు, కొత్తగా రూపొందించిన LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లు ఉన్నాయి.
భారతీయ రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించే మోడల్‌ల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో ఒకదానిలో సన్‌రూఫ్ ఉంది. అంటే కొత్త డిజైర్‌లో సన్‌రూఫ్ కూడా ఉండొచ్చు. కొత్త స్విఫ్ట్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా. వాస్తవానికి, డిజైర్ దాని విభాగానికి శిఖరం లాంటిది. అమ్మకాల్లో ఇంతకుమించి ఎవరూ లేరు. అయినప్పటికీ భారత మార్కెట్లో ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి మోడళ్లతో పోటీపడుతుంది.