Most Selling Cars: వామ్మో.. ఇంత క్రేజ్ ఏంటి భయ్యా.. అమ్మకాలతో పిచ్చెక్కిస్తోన్న టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..!

Auto Sales November 2023: మారుతీ సుజుకి ఆల్టో నవంబర్ 2023లో 8,076 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు అమ్మకాలు 48 శాతం క్షీణించాయి.

Update: 2023-12-12 14:30 GMT

Most Selling Cars: వామ్మో.. ఇంత క్రేజ్ ఏంటి భయ్యా.. అమ్మకాలతో పిచ్చెక్కిస్తోన్న టాప్ 5 హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..!

Car Sales Report November 2023: భారతదేశంలో చాలామంది కొత్త కార్ కొనుగోలుదారులు SUVలను ఇష్టపడటం ప్రారంభించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, హ్యాచ్‌బ్యాక్ కార్లు దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్లుగా పేరుగాంచాయి. అయితే, నవంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 20 కార్ల జాబితాలో కేవలం నాలుగు హ్యాచ్‌బ్యాక్ కార్లు మాత్రమే ఉంటే, అవన్నీ మారుతి సుజుకికి చెందినవే కావడం గమనార్హం.

నంబర్ వన్ స్థానంలో వ్యాగన్ ఆర్..

నవంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో మొదటి స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఉంది. ఇది నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా పేరుగాంచింది. నవంబర్ 2022లో 14,720 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గత నెలలో కంపెనీ 16,567 యూనిట్లను విక్రయించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 13 శాతం ఎక్కువ. మారుతి సుజుకి స్విఫ్ట్ వ్యాగన్ ఆర్ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. మొత్తం అమ్మకాలు 15,311 యూనిట్లతో 1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఈ కార్ల విక్రయాల్లో తగ్గుదల..

ఈ జాబితాలోని మిగిలిన మూడు హ్యాచ్‌బ్యాక్‌ల విషయంలో అదే పరిస్థితి లేదు. ఎందుకంటే, అవన్నీ నవంబర్ 2023లో అమ్మకాలలో క్షీణతను నమోదు చేశాయి. మారుతి సుజుకి బాలెనో 38 శాతం క్షీణతతో 12,961 యూనిట్లు విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది.

ఆల్టో నాలుగో స్థానంలో.. హ్యుందాయ్ ఐ20 5వ స్థానంలో..

మారుతీ సుజుకి ఆల్టో నవంబర్ 2023లో 8,076 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు అమ్మకాలు 48 శాతం క్షీణించాయి. ఆల్టో తర్వాత హ్యుందాయ్ i20, నవంబర్ 2023లో 5,727 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 హ్యాచ్‌బ్యాక్‌లలోకి ప్రవేశించింది. అయితే, దాని అమ్మకాలు 21% క్షీణించాయి.

Tags:    

Similar News