Upcoming Cars: కాస్త ఆగండి.. రయ్ రయ్ మంటూ కొత్త కార్లు వస్తున్నాయ్..!

Upcoming Cars: సెప్టెంబర్ నెలలో మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు సరికొత్త కార్లను లాంచ్ చేయనున్నాయి.

Update: 2024-08-27 08:19 GMT

Upcoming Cars

Upcoming Cars: దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజ‌న్‌ను ఆటోమొబైల్ కంపెనీలు టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో చాలా కార్లు విడుదల కానున్నాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అప్పటి వరకు వేయిట్ చేయండి. వీటిలో చాలా కొత్త మోడల్స్ ఉంటాయి. మారుతీ సుజుకి నుండి టాటా మోటార్స్ వరకు వెహికల్స్ లాంచ్ చేయబోతున్నాయి. ఇందులో ఫ్యామిలీ, ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ వేరియంట్లు ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruti Dzire Facelift
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కారు డిజైర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ కొత్త డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌ను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనుంది. కొత్త మోడల్‌లో అనేక తాజా ఫీచర్లు ఉంటాయి. కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కనిపిస్తుంది. ఇది 1.2 లీటర్, Z12E పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 80bhp పవర్, 112Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటుంది. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

Tata Curvv ICE
టాటా మోటార్స్ తన కర్వ్‌ని ICE వేరియంట్ తీసుకురానుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో వచ్చే నెలలో విడుదల చేయనుంది. కొన్ని నెలల క్రితం టాటా మోటార్స్ కర్వ్ EVని విడుదల చేసింది. కొత్త మోడల్‌లో రెండు టర్బోచార్జ్డ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉంటాయి. ఈ SUV 6 స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కర్వ్ భారతదేశంలో సెప్టెంబర్ 2న ప్రారంభించవచ్చు. మరి దీన్ని కంపెనీ ఏ ధరకు తీసుకువస్తుందో చూడాలి.

Hyundai Alcazar Facelift
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ అల్కాజర్‌ను సెప్టెంబర్ 9న భారతదేశంలో విడుదల చేయనుంది. కొత్త ఆల్కజార్ పూర్తిగా క్రెటాపై ఆధారపడి ఉంటుంది. ఈసారి కొత్త మోడల్ డిజైన్‌లో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. దీని క్యాబిన్ పూర్తిగా రీడిజైన్ చేయబడుతుంది. డిజైన్‌లో కూడా కొత్తదనం ఉంటుంది. ఈ వెహికల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌‌తో వస్తుంది. ముందు మోడల్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్‌ కలిగి ఉంటుంది. రెండోది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌‌తో వస్తుంది. దాని క్యాబిన్‌లో రెండు 10.25 అంగుళాల స్క్రీన్‌లను చూడవచ్చు. ఇది కాకుండా ఈసారి కొత్త సీట్లు కూడా ఉంటాయి.

Tata Nexon CNG
టాటా కర్వ్ తర్వాత నెక్సాన్ CNG మోడల్‌ను కూడా విడుదల చేస్తుంది. దీని లాంచ్‌కు సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. నెక్సాన్ CNG మోడల్ మొదటిసారిగా ఈ సంవత్సరం జరిగిన ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. విశేషమేమిటంటే, ఈసారి మొదటి టర్బో పెట్రోల్ CNG విడుదల అవుతుంది. తర్వాత నెక్షన్ పెట్రోల్, డీజిల్, CNG, EVలలో అందుబాటులో ఉంటుంది. టాటా నెక్సాన్ సిఎన్‌జి మైలేజీకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కారు ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

MG Windsor EV
MG తన మూడవ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ EVని వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఈ క్రాస్‌ఓవర్‌లో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, గ్లాస్ రూఫ్, ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వీల్స్‌పై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇది కాకుండా క్యాబిన్‌లో 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 4 వే అడ్జస్టబుల్ పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఉన్నాయి. MG కొత్త విండ్సర్ EV డిజైన్ దాని అతిపెద్ద ఫీచర్ అవుతుంది. ఈ కారు ధర దాదాపు రూ.15 లక్షలు ఉండవచ్చు. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News