Maruti Swift CNG: మైలేజ్‌లో బెస్ట్.. స్విఫ్ట్ CNG వచ్చేస్తోంది.. దీపావళికి వెలుగులు తెస్తుంది..!

Maruti Swift CNG: మారుతి సుజికి స్విఫ్ట్ సిఎన్‌జి నవంబర్ 4న దీపావళి తర్వాత లాంచ్ కానుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.19 లక్షలు.

Update: 2024-09-27 10:11 GMT

Maruti Swift CNG

Maruti Swift CNG: మారుతి స్విఫ్ట్ ఇటీవలే తన స్విఫ్ట్ ఎన్‌జిని విడుదల చేసింది. ఇది కంపెనీ సిఎన్‌‌‌జి ఫోర్ట్‌ఫోలియోలో కొత్త కారు. కొత్త స్విఫ్ట్ సిఎన్‌జిని మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.19 లక్షలు. ఇప్పుడు ఈ కంపెనీ డీలర్‌షిప్‌లకు చేరుకుంటుంది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే షోరూమ్‌కి వెళ్లి చూడొచ్చు. ఈ నేపథ్యంలో కారు పవర్‌ట్రెయిన్, మైలేజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

మీరు మారుతి స్విఫ్ట్ CNGని VXi, VXi (O), ZXiలలో కొనుగోలు చేయవచ్చు. ZXi వేరియంట్ LED లైట్ సెటప్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, కీలెస్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లతో వస్తుంది. భారతీయ మార్కెట్లో ఇది గ్రాండ్ ఐ10 నియోస్, టియాగో సిఎన్‌జితో నేరుగా పోటీ పడుతుంది.

స్విఫ్ట్ CNG 1.2 లీటర్ Z సిరీస్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో ఆధారంగా 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. ఈ స్టాండర్డ్ మోడ్‌లో 80bhp పవర్, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNGకి మార్చినప్పుడు పవర్ అవుట్‌పుట్ 69bhp, 102Nm పీక్ టార్క్‌కి తగ్గుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ పరంగా స్విఫ్ట్ CNG 32.85 km/kg వరకు మైలేజీని ఇస్తుంది.

కంపెనీ తన న్యూ జెన్ స్విఫ్ట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తొలిసారిగా ఈ సెడాన్ అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో “ది బెస్ట్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్” అనే క్యాప్షన్ ఇచ్చింది కంపెనీ. డిజైర్ దేశంలోనే నంబర్ 1 సెడాన్. ఇది హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లతో పోటీపడుతుంది. అయితే,సేల్స్‌లో ఏ మోడల్ దానికి దగ్గరగా ఉండదు. కొత్త స్విఫ్ట్‌లో అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కొత్త ఇంజన్‌ను కూడా కంపెనీ అందించనుంది. నవంబర్ 4న దీపావళి తర్వాత దీన్ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News