Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి 5 కొత్త ICE మోడళ్లు.. లిస్టులో 7-సీటర్ SUV కూడా.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?

Upcoming Maruti Cars: మారుతి సుజుకి 2024లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది, వీటిలో తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్ అలాగే EVX కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ SUV ఉన్నాయి.

Update: 2023-11-26 16:00 GMT

Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి 5 కొత్త ICE మోడళ్లు.. లిస్టులో 7-సీటర్ SUV కూడా.. ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?

Upcoming Maruti Cars: మారుతి సుజుకి 2024లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది, వీటిలో తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్ అలాగే EVX కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ SUV ఉన్నాయి. మారుతి సుజుకి భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ కోసం దూకుడుగా అడుగులు వేస్తోంది. మారుతీ సుజుకీ 2031 నాటికి ఐదు కొత్త ICE మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఏయే మోడల్స్ వస్తాయో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

కొత్త 7-సీటర్ SUV రావచ్చు..

కొన్ని ఊహాగానాల ప్రకారం, మారుతి సుజుకి 7-సీటర్ SUVని సిద్ధం చేస్తోంది. ఇది గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉండవచ్చు. ఈ మోడల్‌లో పవర్‌ట్రెయిన్‌తో పాటు గ్రాండ్ విటారా మాదిరిగానే డిజైన్ అంశాలు, ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే, ఇది పెద్దదిగా ఉంటుంది. ఎక్కువ స్థలంతో పెద్ద ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. గ్రాండ్ విటారాలో 1.5L K15C పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ లేదా 1.5L అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ఎంపిక ఉంది. ఇది వరుసగా 103bhp, 115bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త 3-వరుసల SUV మారుతి సుజుకి ఇటీవల ఏర్పాటు చేసిన ఖార్ఖోడా ఫెసిలిటీలో తయారు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 7-సీటర్ SUV హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా XUV700 వంటి కార్లతో పోటీపడుతుంది. ప్రస్తుతం ఇది కేవలం ఊహాగానాలు మాత్రమేనని, కంపెనీ దానిని ధృవీకరించలేదు.

కొత్త ఎమ్‌పీవీ, హ్యాచ్‌బ్యాక్, మైక్రో ఎస్‌యూవీలను తీసుకువచ్చే అవకాశం..

అదనంగా, మారుతి సుజుకి కియా కేరెన్స్‌తో పోటీగా సరసమైన MPVని కూడా పరిచయం చేయవచ్చు. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల మధ్య ఉండవచ్చు. కంపెనీ మార్కెట్లోకి హ్యాచ్‌బ్యాక్, మైక్రో SUVని కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. ఇది బహుశా సెలెరియో, ఆల్టోలకు వారసులుగా తీసుకురానుంది. హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా పంచ్‌లతో పోటీపడుతుంది.

వచ్చే ఏడాది 3 కొత్త కార్లు..

మారుతి సుజుకి 2024లో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో తదుపరి తరం స్విఫ్ట్, డిజైర్ అలాగే EVX కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ SUV ఉన్నాయి. కొత్త స్విఫ్ట్, డిజైర్ మోడల్‌లు వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానున్నాయి. అయితే EVX ఎలక్ట్రిక్ SUV అక్టోబర్ లేదా నవంబర్ 2024 నాటికి ప్రారంభించబడుతుంది.

Tags:    

Similar News