Jimny Thunder Edition: ఎస్‌యూవీ సాధారణ మోడల్ కంటే రూ.2 లక్షలు తక్కువే.. థార్‌తో పోటీకి సిద్ధమైన జిమ్నీ థండర్ ఎడిషన్.. కేక పుట్టించే ఫీచర్లు ఇవే..!

మారుతీ సుజుకి జిమ్నీకి చెందిన 'థండర్ ఎడిషన్'ని భారతదేశంలో విడుదల చేసింది. 4x4 SUV ప్రత్యేక ఎడిషన్ సాధారణ మోడల్ కంటే రూ. 2 లక్షలు తక్కువ.

Update: 2023-12-05 06:38 GMT

Jimny Thunder Edition: ఎస్‌యూవీ సాధారణ మోడల్ కంటే రూ.2 లక్షలు తక్కువే.. థార్‌తో పోటీకి సిద్ధమైన జిమ్నీ థండర్ ఎడిషన్.. కేక పుట్టించే ఫీచర్లు ఇవే..!

Jimny Thunder Edition: మారుతీ సుజుకి జిమ్నీకి చెందిన 'థండర్ ఎడిషన్'ని భారతదేశంలో విడుదల చేసింది. 4x4 SUV ప్రత్యేక ఎడిషన్ సాధారణ మోడల్ కంటే రూ. 2 లక్షలు తక్కువ. దీని ప్రారంభ ధర రూ. 10.74 లక్షలు, ఇది టాప్ వేరియంట్‌లో రూ. 14.05 లక్షలుగా పేర్కొంది. సాధారణ వేరియంట్ రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షల వరకు ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉంటాయి. మారుతి సుజుకి జిమ్నీకి ప్రధాన ప్రత్యర్థి మహీంద్రా థార్ SUV. ఇది కాకుండా, ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) విభాగంలో ఫోర్స్ గూర్ఖా నుంచి కూడా పోటీని ఎదుర్కోనుంది.

అనేక మీడియా నివేదికలలో, జిమ్నీ మైలేజ్ లీటరుకు 16-19 కిలోమీటర్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

జిమ్నీ టూ-వీల్ డ్రైవ్‌తో రాదు..

ఆటో ఎక్స్‌పో-2023లో కంపెనీ ఈ కారును మొదటిసారిగా ప్రదర్శించింది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో దీన్ని ప్రారంభించారు. మారుతి సుజుకి జిమ్నీ SUV కోసం చౌకైన టూ-వీల్-డ్రైవ్ (2WD) ఎంపిక అవకాశాన్ని తోసిపుచ్చింది.

మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 'గ్లోబల్ మార్కెట్‌లో జిమ్నీ ఇమేజ్ ఆఫ్-రోడర్‌గా ఉంది. మేం టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను పరిచయం చేస్తే, అది బ్రాండ్‌ను పలుచన చేస్తుంది. కాబట్టి 2WD జిమ్నీ పరిశీలనలో లేదు. మేం 4WD వెర్షన్‌ను విక్రయించడం కొనసాగిస్తాం అంటూ తెలిపాడు.

మారుతి జిమ్నీ థండర్ ఎడిషన్ ప్రత్యేకత ఏటంటే..

ఈ ఆఫ్‌రోడర్ కోసం యాక్సెసరీ కిట్ అందిస్తోంది. మారుతిలో ఫ్రంట్ బంపర్ గార్నిష్, డీకాల్స్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, ఫ్లోర్ మ్యాట్స్ (మాన్యువల్ వేరియంట్‌కు ప్రత్యేకం, ఆటోమేటిక్ వేరియంట్‌కు ప్రత్యేకం)తోపాటు టాన్-ఫినిష్ స్టీరింగ్ వీల్ వంటి అనుబంధ అంశాలు ఉన్నాయి. ఇది కాకుండా, జిమ్నీ థండర్ ఎడిషన్‌లో డోర్ వైజర్, ఫ్రంట్, రియర్ ఫెండర్ గార్నిష్, బాడీ క్లాడింగ్ వంటి ఉపకరణాలు కూడా అందించింది.

Tags:    

Similar News