Maruti Suzuki Invicto Price Drop: మారుతి అదిరే ఆఫర్లు.. ఇన్విక్టోపై రూ. 2.15 లక్షల డిస్కౌంట్
Maruti Suzuki Invicto Price: MY24 మారుతి సుజుకి ఇన్విక్టోపై కస్టమర్స్ గరిష్టంగా రూ. 2.15 లక్షల డిస్కౌంట్‌ను అందిస్తోంది. మారుతి సుజుకి ఇన్విక్టోపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Invicto Price: భారతీయ కస్టమర్లలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మీరు కూడా 7 సీటర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ శుభవార్త మీకే. వాస్తవానికి, మారుతి సుజుకి ఫేమస్ MPV ఇన్విక్టో జనవరి 2025లో రూ. 2 లక్షల కంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. మారుతి సుజుకి ఇన్విక్టోపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
MY24 మారుతి సుజుకి ఇన్విక్టోపై కస్టమర్స్ గరిష్టంగా రూ. 2.15 లక్షల డిస్కౌంట్‌ను అందిస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్‌లో ఎక్స్‌ఛేంజ్ బోనస్, స్క్రాప్‌పేజ్ బోనస్ కూడా ఉన్నాయి. అయితే MY25 ఇన్విక్టోపై ఎలాంటి తగ్గింపులు అందుబాటులో లేవు.
ఇక పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే... మారుతి సుజుకి ఇన్విక్టోలోని ఇన్నోవా హైక్రాస్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటారుతో అందించారు. ఇది గరిష్టంగా 186 Bhp పవర్, 206 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఇన్విక్టో 9.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మారుతి సుజుకి ఇన్విక్టో ధృవీకరించిన మైలేజ్ లీటరుకు 23.24 కిలోమీటర్లుగా ఉంది.
మరోవైపు, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ ఫీచర్స్‌గా అందించారు. ఇది కాకుండా భద్రత కోసం, కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఇన్విక్టో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 25.21 లక్షల నుండి రూ. 28.92 లక్షల వరకు ఉంది.