Maruti Swift CNG Price and Mileage: మిడిల్ క్లాస్ కార్.. CNG వెర్షన్‌లో మారుతి స్విఫ్ట్.. ధర తక్కువ మైలేజీ చాలా ఎక్కువ..!
Maruti Swift CNG Price and Mileage: మారుతి సుజుకి నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ CNGని విడుదల చేసింది. దీని ధర, మైలేజ్ తెలుసుకోండి.
Maruti Swift CNG Price and Mileage: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ CNGని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ మొదట తన పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు. ఇప్పుడు కంపెనీ అధికారికంగా తన కంపెనీ CNG వేరియంట్‌ను సేల్‌కు తీసుకొచ్చింది. కొత్త మారుతి స్విఫ్ట్ CNG ప్రారంభ ధర రూ. 8.20 లక్షలు (ఎక్స్-షోరూమ్).
మారుతి సుజుకి తన కొత్త స్విఫ్ట్ CNGని మొత్తం 3 వేరియంట్లలో VXi, VXi (O), ZXi లలో పరిచయం చేసింది. మీరు పెట్రోల్ మోడల్‌లో పొందే విధంగానే లుక్, డిజైన్ ఉంటుంది. కేవలం CNG కిట్‌ని మాత్రమే దాని ఇంజన్‌తో లింక్ చేశారు . ఇది దాని లైనప్‌ను ఫుల్ చేస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ తరం మోడల్‌లో కంపెనీ పూర్తిగా కొత్త ఇంజన్‌ను ఉపయోగించింది. పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే, CNG వేరియంట్ ధర సుమారు రూ. 90,000 ఎక్కువ.
స్విఫ్ట్ CNGలో కంపెనీ పూర్తిగా కొత్త 'Z' సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ని అందించింది. CNG మోడ్‌లో, ఈ 1.2 లీటర్ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ కొద్దిగా తగ్గుతుంది. ఈ ఇంజన్ 69.75 హెచ్‌పి పవర్, 101.8 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
మారుతి స్విఫ్ట్ CNG వేరియంట్లు, ధరలు:
1. VXi రూ. 8.20 లక్షలు
2. VXi (O) రూ. 8.47 లక్షలు
3. ZXi రూ. 9.20 లక్షలు
కంపెనీ ఈ కారులో సింగిల్ పీస్ లార్జ్ సిఎన్‌జి సిలిండర్‌ను ఉపయోగించింది. దీనికి బూట్‌లో స్పేస్ కూడా లభిస్తుంది . స్విఫ్ట్ CNGతో పాటు మారుతి సుజుకి డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని కూడా ఉపయోగించాలని భావించారు, దీనిని మొదట టాటా మోటార్స్ ప్రారంభించింది. అయితే, మైలేజ్ పరంగా ఇది మునుపటి K సిరీస్ CNG స్విఫ్ట్ కంటే మెరుగ్గా ఉంది. ఈ కారు CNG మోడ్‌లో 32.85 km/kg వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
మారుతి స్విఫ్ట్ CNG ప్రారంభ స్థాయి అంటే బేస్ VXI వేరియంట్‌లో కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రిమోట్ సెంట్రల్ లాకింగ్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 14 అంగుళాల వీల్స్ అందించింది. మిడ్-స్పెక్ VXI (O) వేరియంట్‌లో కొన్ని అదనపు ఫీచర్లు తీసుకొచ్చిందిద. ఇందులో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.
ఇది కాకుండా స్విఫ్ట్ CNG టాప్ వేరియంట్ ZXiలో కంపెనీ డే రన్నింగ్ లైట్లు, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ వాషర్ వైర్ మొదలైన వాటితో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను అందించింది. స్విఫ్ట్ సిఎన్‌జి ప్రధానంగా టాటా టియాగో సిఎన్‌జి, హ్యుందాయ్ ఐ10 సిఎన్‌జి వంటి కార్లతో పోటీపడుతుంది. టియాగో సిఎన్‌జి ప్రారంభ ధర రూ. 6.60 లక్షలు. ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా అందుబాటులో ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ సిఎన్‌జి వేరియంట్ ప్రారంభ ధర రూ.7.68 లక్షలు. అయితే టాటా మోటార్స్ CNG కారులో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు.మీరు బూట్ స్పేస్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు.