Maruti Grand Vitara Discount: కార్.. లవర్స్‌కు పండగే.. మారుతీ ఎస్‌యూవీపై బిగ్ డిస్కౌంట్.. ఎప్పటి వరకు అంటే!
Maruti Grand Vitara Discount: మారుతీ సుజికీ కంపెనీ గ్రాండ్ విటారా ఎస్‌యూవీపై రూ. 1.28 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఇది హైబ్రిడ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంటుంది.
Maruti Grand Vitara Discount: ఎస్‌యూవీలకు దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే కార్ లవర్స్‌కు మారుతీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీకి చెందిన మిడ్ సైజ్ ఎస్‌యూవీ మారుతీ గ్రాండ్ విటారాపై బెస్ట్ డీల్‌ను ప్రకటించింది. దీని అమ్మకాలు తగ్గడంతో కంపెనీ స్టాక్ క్లియర్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో హైబ్రిడ్ టెక్నాలజీని ఉంటుంది. ఇది 28 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీపై ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో గ్రాండ్ విటారా హైబ్రిడ్‌పై రూ. 1.28 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అయితే దీని మైల్డ్ హైబ్రిడ్ మోడల్‌పై రూ. 63,100, CNG మోడల్‌పై రూ. 33,100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఓల్డ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది.
మారుతీ గ్రాండ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 19.93 లక్షల వరకు ఉంది. గ్రాండ్ విటారా 26 సెప్టెంబర్ 2022న లాంచ్ అయింది. ఇందులోని హైబ్రిడ్ టెక్నాలజీ దీని ప్లస్ పాయింట్. ఇది 1462 సీసీ, 1490 సీసీ రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఇవి 102 బీహెచ్‌పీ పవర్‌తో 137 ఎన్‌ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తాయి. ఈ ఇంజన్లు 20.58, 27.97 కిమీ మైలేజీని అందిస్తాయి.
మారుతి గ్రాండ్ విటారాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా కారులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో 5 మంది ప్రయాణించవచ్చు.
గ్రాండ్ విటారా అమ్మకాల గురించి మాట్లాడితే ఈ ఏడాది జూన్‌లో ఈ కారు మొత్తం 9,679 యూనిట్లును కంపెనీ సేల్ చేసింది. కేవలం 23 నెలల్లోనే 2 లక్షల యూనిట్లకు పైగా గ్రాండ్ విటారా విక్రయించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కంపెనీ ప్రకారం ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్నకారు. విడుదలైన 10 నెలల్లోనే లక్ష యూనిట్ల గ్రాండ్ విటారా అమ్ముడైంది. అమ్మకాల పరంగా ఈ ఎస్‌యూవీ క్రెటా, సెల్టోస్‌లను క్రాస్ చేసింది.