Maruti Suzuki: కొత్త మారుతి డిజైర్.. 31 కిమీ కంటే ఎక్కువ మైలేజీ..!
Maruti Suzuki: మారుతీ సుజుకి భారతీయ కస్టమర్లు ఎంతో ఇష్టపడే కారు. ఇప్పుడు కంపెనీ డిజైర్ S-CNG వేరియంట్‌ను విడుదల చేసింది.
Maruti Suzuki: మారుతీ సుజుకి భారతీయ కస్టమర్లు ఎంతో ఇష్టపడే కారు. ఇప్పుడు కంపెనీ డిజైర్ S-CNG వేరియంట్‌ను విడుదల చేసింది. పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరల దృష్ట్యా ఇప్పుడు కస్టమర్లు CNG, ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అందుకే కంపెనీ ఇప్పుడు CNG వేరియంట్‌లపై శ్రద్ధ చూపుతోంది. కంపెనీ మిగిలిన CNG కార్ల మాదిరిగా కాకుండా DZire మిడ్-స్పెక్ VXI, ఖరీదైన ZXI ట్రిమ్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలో ఈ రెండు వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 8.14 లక్షలు, రూ. 8.82 లక్షలుగా నిర్ణయించారు. మారుతి సుజుకి DZire ఫ్యాక్టరీ అమర్చిన CNG వేరియంట్‌ను ప్రైవేట్ కస్టమర్‌లకు విక్రయించడానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ మోడల్‌ను టాక్సీ కోటా కింద మాత్రమే టూర్-S పేరుతో విక్రయాలు జరుపుతుంది.
31 కిలోమీటర్ల మైలేజ్
మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ కారు కస్టమర్లకి బాగా నచ్చింది. ఇప్పుడు దాని మైలేజ్ కారణంగా కంపెనీ అమ్మకాలు ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఈ కారును 1 కిలో సిఎన్‌జిలో 31.12 కి.మీ వరకు నడపవచ్చు. పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే అదే 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. స్టాండర్డ్ మోడల్‌లో ఈ ఇంజన్ 88.5 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే సిఎన్‌జి వేరియంట్‌లో ఈ ఇంజన్ పవర్ 76 బిహెచ్‌పి 98.5 ఎన్ఎమ్ పీక్ టార్క్‌కు తగ్గుతుంది. ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
శక్తివంతమైన ఫీచర్లు
కొత్త DZire S-CNG పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్ ఇంజిన్ జీవితాన్ని పెంచడానికి మెరుగైన మైలేజీని అందించడానికి, బలమైన భద్రతను అందించడానికి డిజైన్ చేశామని మారుతీ సుజుకి ఇండియా తెలిపింది. మిగిలిన S-CNG మోడల్ మాదిరిగానే Dzire S-CNG కూడా డ్యూయల్ ఇండిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను, గాలి-ఇంధన నిష్పత్తి కోసం ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఫీచర్లను పరిశీలిస్తే, కొత్త DZire తో స్టాండర్డ్ VXi, ZXi మోడల్స్ ఫీచర్లు ఇచ్చారు. కస్టమర్లు కొత్త Dzire S-CNGని అద్దెకు తీసుకోవచ్చు. దీని కోసం ప్రతి నెల రూ. 16,999 చెల్లించాల్సి ఉంటుంది.