Maruti Brezza: దీపావళి ఆఫర్.. మారుతీ బ్రెజ్జాపై బంపర్ డిస్కౌంట్, ఇప్పుడు ఎంతంటే..!
Maruti Brezza: మారుతీ సుజుకి ఇండియా తన కార్లపై నవరాత్రి, దీపావళి తగ్గింపులను ప్రకటించింది.
Maruti Brezza: మారుతీ సుజుకి ఇండియా తన కార్లపై నవరాత్రి, దీపావళి తగ్గింపులను ప్రకటించింది. కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న SUV బ్రెజ్జా ఈ జాబితాలో ఉంది. కంపెనీ అధికారికంగా బ్రెజ్జాపై ఎలాంటి తగ్గింపును ఇవ్వడం లేదు. అయితే చాలా మంది డీలర్లు దీనిపై రూ. 25,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, కంపెనీ కస్టమర్లకు 5000 రూపాయల స్క్రాపేజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.34 లక్షలు. ఈ SUV మహీంద్రా XUV 3XO, Kia Sonet, Tata Nexon వంటి మోడళ్లతో నేరుగా పోటీపడుతుంది. అదే సమయంలో బ్రెజ్జా సేల్‌లో వీటన్నింటికీ మించి ఉంది.
Maruti Brezza Specifications
బ్రెజ్జాలో కొత్త తరం K-సిరీస్ 1.5-డ్యూయల్ జెట్ WT ఇంజన్ ఉంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లింకై ఉంటుంది. ఈ ఇంజన్ 103hp పవర్, 137Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంధన సామర్థ్యం కూడా పెరిగిందని కంపెనీ పేర్కొంది. న్యూ బ్రెజ్జా మాన్యువల్ వేరియంట్ 20.15 kp/l మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.80 kp/l మైలేజీని ఇస్తుంది.
ఇందులో 360 డిగ్రీల కెమెరా ఉంది. ఈ కెమెరా చాలా హైటెక్, మల్టీ-ఇన్ఫర్మేషన్ ఇచ్చే కెమెరా. ఈ కెమెరా కారు 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్టై ఉంటుంది. దీనిని సుజుకి, టయోటా రెండూ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ప్రత్యేకత ఏమిటంటే కారు లోపల కూర్చున్నప్పుడు, మీరు స్క్రీన్‌పై కారు చుట్టూ ఉన్న విజువల్స్ చూడొచ్చు.
మొట్టమొదటిసారిగా కారులో వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ కూడా అందించారు. ఈ డాక్ సహాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను వైర్‌లెస్‌గా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో వేడిని హీట్ కంట్రోల్ చేయడానికి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. మారుతి అనేక కనెక్టింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇది ఈ కాంపాక్ట్ SUVని చాలా విలాసవంతమైన, అధునాతనమైనదిగా చేస్తుంది.