Maruti Celerio: లీటర్‌కు 35కిమీల మైలేజ్.. ధరలోనే కాదు.. భద్రతలోనూ ది బెస్ట్.. అయినా, మాకొద్దంటోన్న జనాలు.. ఎందుకో తెలుసా?

Maruti Celerio: మారుతి సుజుకి సెలెరియో కారు పొదుపు, మంచి మైలేజీ, అవసరమైన అనేక ఫీచర్లను అందించినప్పటికీ, విక్రయాల పరంగా దేశంలోని టాప్ 25 కార్లలో ఇది చోటు దక్కించుకోలేదు.

Update: 2023-12-13 14:30 GMT

Maruti Celerio: లీటర్‌కు 35కిమీల మైలేజ్.. ధరలోనే కాదు.. భద్రతలోనూ ది బెస్ట్.. అయినా, మాకొద్దంటోన్న జనాలు.. ఎందుకో తెలుసా?

Maruti Celerio Price, Features & Mileage: ఉత్పత్తి బాగున్నప్పటికీ మార్కెట్ నుంచి మంచి స్పందన రాకపోవడం చాలా సార్లు జరుగుతుంది. మారుతి సుజుకి సెలెరియో విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అయితే, మనం దాని కారణాలను ఓసారి చూస్తే.. అనేక విభిన్న అంశాలు బయటపడతాయి. కానీ, వాస్తవం ఏమిటంటే మారుతి సుజుకి సెలెరియో విషయంలో స్పందన కరవైంది. ఇది సాధారణంగా అమ్మకాల పరంగా దేశంలోని టాప్ 25 కార్లలో కూడా చేరదు. అయితే కారు పొదుపుగా ఉంటుంది. మంచి మైలేజీని ఇస్తుంది. అనేక అవసరమైన ఫీచర్లను అందిస్తుంది. ఇన్ని విషయాలు ఎలా ఉన్నా, అమ్మకాల పరంగా సెలెరియో ఫ్లాప్‌గా కనిపిస్తోంది.

మారుతి సుజుకి సెలెరియో ధర..

మారుతి సెలెరియో 5-సీటర్ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది – LXI, VXI, ZXI, ZXI+. వీటిలో, CNG వేరియంట్ VXI ట్రిమ్‌లో కూడా అందుబాటులో ఉంది. సెలెరియో ధరలు రూ. 5.37 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ వేరియంట్ కోసం రూ. 7.14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. దీని CNG వేరియంట్ ధర రూ. 6.74 లక్షలు.

మారుతి సుజుకి సెలెరియో ఫీచర్లు..

ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, పాసివ్ కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (వ్యాగన్ఆర్ వేరియంట్), టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రిక్ ORVMలు, డ్యూయల్ ఫ్రంట్ ఉన్నాయి. EBDతో కూడిన ABS, హిల్-హోల్డ్ అసిస్ట్ (ఆటోమేటిక్ వేరియంట్‌లలో), వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో ఇంజన్ స్పెసిఫికేషన్స్..

ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ పెట్రోల్‌పై 67 PS, 89 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, ఇది CNGపై 56.7PS/82Nm పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఎంపికతో వస్తుంది. అయితే CNG వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇది సెగ్మెంట్ మొదటి ఆటోమేటిక్ ఐడిల్ స్టార్ట్-స్టాప్‌ను కూడా కలిగి ఉంది.

మారుతి సుజుకి సెలెరియో మైలేజ్..

-- పెట్రోల్ MT: 25.24 kmpl వరకు

-- పెట్రోల్ AMT: 26.68 kmpl వరకు

-- CNG: 35.6 kmpl వరకు

Tags:    

Similar News