Maruti Brezza: మార్కెట్‌ను దున్నేస్తోన్న మారుతీ బ్రెజా.. 25 కిమీల మైలేజ్‌తో వావ్ అనిపించే ఫీచర్లు.. ధరెంతో తెలుసా?
Maruti Brezza Sales: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల్లో ఈ కారు 10,67,000 యూనిట్ల విక్రయాల అంచనాను దాటుతుందని కంపెనీ అంచనా వేసింది. దీని తర్వాత, ఈ కారు తక్కువ సమయంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించనుంది.
Maruti Brezza Sales: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతీ సుజుకీ బ్రెజ్జా విక్రయాల్లో దూసుకపోతోంది. కంపెనీ ఈ SUVని మార్చి 2016లో విడుదల చేసింది. నవంబర్ 2023 నాటికి ఇది 10 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును చేరుకుంది. నవంబర్ 2023 వరకు మారుతి బ్రెజ్జా 9,96,608 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అంటే 10 లక్షల యూనిట్ల అమ్మకాల కంటే కేవలం 3,392 యూనిట్లు మాత్రమే తక్కువ. ఈ సంఖ్య డిసెంబర్ 2023 మొదటి వారం నాటికి పూర్తవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల్లో ఈ కారు 10,67,000 యూనిట్ల విక్రయాల అంచనాను దాటుతుందని కంపెనీ అంచనా వేసింది. దీని తర్వాత, ఈ కారు తక్కువ సమయంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించనుంది.
మారుతి బ్రెజ్జా భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్‌తో ప్రత్యక్ష పోటీని కలిగి ఉంది. ఈ కారు మార్చి 2016లో ప్రారంభించారు. ఇది అమ్మకాల పరంగా నెక్సాన్ కంటే వెనుకంజలో ఉంది. 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో టాటా నెక్సన్ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. దీని తరువాత, మారుతి బ్రెజ్జా CNG మోడల్‌ను విడుదల చేసింది. ఇది అమ్మకాలను పెంచడంలో సహాయపడింది.
నివేదికల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో, మారుతి 1.10 లక్షల యూనిట్లకు పైగా బ్రెజ్జాను విక్రయించింది. ఇది నెక్సాన్ అమ్మకాల కంటే 593 యూనిట్లు ఎక్కువ.
బ్రెజ్జా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 103PS పవర్, 137Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో అందుబాటులో ఉంది. కంపెనీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో CNGతో కూడా అందిస్తుంది. మైలేజీ పరంగా కూడా బ్రెజ్జా మిమ్మల్ని నిరాశపరచదు. ఇది ఆటోమేటిక్ వేరియంట్‌లో 19.8kmpl మైలేజీని, CNGలో 25.51km/kgని కలిగి ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, మారుతి బ్రెజ్జా తన విభాగంలో సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ప్యాడిల్ షిఫ్టర్స్ (AT వేరియంట్), హెడ్-అప్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్‌లతో పరిచయం చేసిన తొలి కార్‌గా నిలిచింది.
భద్రత పరంగా కూడా, మారుతి కొత్త బ్రెజ్జాలో చాలా మెరుగుదలలు చేసింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన ABS వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి బ్రెజ్జా ధరలు రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ మోడల్ కోసం రూ. 13.98 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. బ్రెజ్జా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300, టాటా నెక్సన్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లతో పోటీపడుతుంది.