Brezza CBG: బయో గ్యాస్‌తో నడిచే మారుతి సుజుకి బ్రెజ్జా సీబీజీ.. 25 కిమీల మైలేజీతో కళ్లు చెదిరే ఫీచర్లు..!

Bharat Mobility Show 2024: మారుతీ సుజుకి దేశంలో పర్యావరణ అనుకూల వాహనాల తయారీకి కూడా పేరుగాంచింది.

Update: 2024-02-06 05:49 GMT

Brezza CBG: బయో గ్యాస్‌తో నడిచే మారుతి సుజుకి బ్రెజ్జా సీబీజీ.. 25 కిమీల మైలేజీతో కళ్లు చెదిరే ఫీచర్లు..!

Bharat Mobility Show 2024: మారుతీ సుజుకి దేశంలో పర్యావరణ అనుకూల వాహనాల తయారీకి కూడా పేరుగాంచింది. భారతదేశంలో CNG, పెట్రోల్-హైబ్రిడ్ కార్ల తయారీలో కంపెనీ అతిపెద్దది. ఇటీవల, కంపెనీ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో బయో మీథేన్ గ్యాస్‌తో నడిచే బ్రెజ్జా కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) మోడల్‌ను పరిచయం చేసింది. బ్రెజ్జా CBG డిజైన్ దాని ప్రామాణిక మోడల్‌ను పోలి ఉంటుంది. బయో గ్యాస్‌తో పనిచేసేలా కంపెనీ ఇంజన్‌లో మార్పులు చేసింది.

ఇంజన్ గురించి చెప్పాలంటే, ఇందులో 1.5-లీటర్ కె15 సి పెట్రోల్ ఇంజన్ ఉపయోగించింది. ఈ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 102bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ, CBG మోడ్‌లో దీని ఇంజన్ 87bhp శక్తిని, 121Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

మారుతి బ్రీజీ CBG డిజైన్ స్టాండర్డ్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. కానీ, దాని చుట్టూ కొన్ని CBG స్టిక్కర్‌లు ఉన్నాయి. ఇది విభిన్న గుర్తింపును ఇస్తుంది. ఇందులో డ్యూయల్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రూఫ్ రెయిల్‌లు, డ్యూయల్-టోన్ బంపర్, ర్యాప్-అరౌండ్ LED టైల్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేలైట్ రన్నింగ్ లైట్లు, ఫాగ్‌లైట్లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ A, B, C- పిల్లర్లు, వెనుక వైపర్, వాషర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మారుతి బ్రెజీ CBG క్యాబిన్‌లో సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్స్, సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ టెక్నాలజీ, స్పెషల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, లెదర్ వంటి అనేక ఆకర్షణీయమైన, ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కాకుండా, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

మైలేజ్ ఎంత?

Brezza CBG మైలేజీని మారుతి వెల్లడించలేదు. అయితే, దాని CNG వేరియంట్ ప్రకారం దాని మైలేజ్ కిలోగ్రాముకు 25.51 కిలోమీటర్లుగా ఉంటుందని అంచనా. ఈ కాంపాక్ట్ SUVలో 48 లీటర్ పెట్రోల్ ట్యాంక్, CBG కోసం 55 లీటర్ (నీటికి సమానం) ట్యాంక్ ఉన్నాయి.

ప్రస్తుతం, మారుతి బ్రెజ్జా CBG లాంచ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. కానీ, 2024 మధ్య నాటికి మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. Brezza ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.29 లక్షల నుంచి మొదలై రూ. 9.94 లక్షల వరకు ఉంటుంది. LXI, VXI, ZXI వేరియంట్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News