Most Selling Car: ఎర్టిగా, క్రెటా, పంచ్, స్విఫ్ట్, వ్యాగనార్.. వీటన్నింటిని వెనక్కు నెట్టి నెంబర్ 1గా నిలిచిన కారు ఏంటో తెలుసా?
Most Selling Cars in November 2024 : గత నెలలో అంటే నవంబర్ 2024లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వచ్చేసింది. గత నెలలో ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేసిన కారు మారుతీ బాలెనో. చాలా కాలం తర్వాత బాలెనో మరోసారి దేశంలోనే నెంబర్-1 కారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా మరోసారి ఎస్‌యూవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో కారు ఇదే. టాప్-10 జాబితాలో చాలా ఆశ్చర్యకరమైన రివర్సల్స్ కనిపించాయి. గత 2 నెలలుగా నెంబర్-1 స్థానంలో ఉన్న మారుతీ ఎర్టిగా నెంబర్-5కి చేరుకుంది. టాటా నెక్సాన్ నంబర్-4 స్థానంలో నిలిచింది.
గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల విషయానికొస్తే.. నవంబర్ 2024లో 16,293 యూనిట్లు మారుతి బాలెనో అమ్ముడయ్యాయి. నవంబర్ 2023లో ఈ సంఖ్య 12,961 యూనిట్లుగా ఉంది. అంటే 26% వార్షిక వృద్ధి నమోదైంది. హ్యుందాయ్ క్రెటా నవంబర్ 2024లో 15,452 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 11,814 యూనిట్లుగా ఉంది. అంటే 31శాతం వార్షిక వృద్ధిని సాధించింది. నవంబర్ 2024లో టాటా పంచ్ 15,435 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 14,383 యూనిట్లుగా ఉంది. అంటే 7 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
నవంబర్ 2024లో టాటా నెక్సాన్ 15,329 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 14,916 యూనిట్లుగా ఉంది. అంటే 3 శాతం వార్షిక వృద్ది మాత్రమే నమోదైంది. నవంబర్ 2024లో మారుతీ ఎర్టిగా 15,150 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 12,857 యూనిట్లుగా ఉంది. అంటే 18 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. నవంబర్ 2024లో మారుతి బ్రెజ్జా 14,918 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 13,393 యూనిట్లుగా ఉంది. అంటే 11 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. నవంబర్ 2024లో మారుతి ఫ్రాంక్స్ 14,882 యూనిట్లు విక్రయించారు. నవంబర్ 2023లో ఈ సంఖ్య 9,867 యూనిట్లు మాత్రమే. అంటే 51 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.
నవంబర్ 2024లో మారుతీ స్విఫ్ట్ 14,737 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 15,311 యూనిట్లుగా ఉంది. అంటే ఇందులో 4 శాతం వార్షిక క్షీణత కనిపించింది. నవంబర్ 2024లో మారుతీ వ్యాగన్ఆర్ 13,982 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 16,567 యూనిట్లుగా ఉంది. అంటే అది 16 శాతం వార్షిక క్షీణతను నమోదైంది. మహీంద్రా స్కార్పియో నవంబర్ 2024లో 12,704 యూనిట్లను విక్రయించింది. నవంబర్ 2023లో ఈ సంఖ్య 12,185 యూనిట్లుగా ఉంది. అంటే 4 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.