Mahindra Xuve9: ఫుల్ ఛార్జ్‌తో 450 కిమీల వేగం.. దూసుకొస్తోన్న మహీంద్రా XUV.e9 కూపే SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంకే..
Mahindra Xuve9: మహీంద్రా తన XUV.e9ని నిరంతరం టెస్ట్ చూస్తూనే ఉంది. ఇది ఏప్రిల్ 2025లో విడుదల కానుంది.
Mahindra Mahindra xuve9 Coupe SUV: మహీంద్రా తన XUV.e9ని నిరంతరం టెస్ట్ చూస్తూనే ఉంది. ఇది ఏప్రిల్ 2025లో విడుదల కానుంది. ఈ మేరకు వైరల్ అవుతోన్న కొన్ని ఫొటోలు రాబోయే కూపే-SUV లోపలి భాగాన్ని చూపించాయి. ఇందులో ఎలాంటి ఫీచర్లు అందించనుందనే విషయాన్ని వెల్లడించింది.
ఇక్కడ ఉన్న ఫొటోలు చూస్తే.. కొత్త XUV.e9 కూపే పూర్తి-నిడివి గల స్క్రీన్‌ను పొందుతుంది. అది డ్యాష్‌బోర్డ్ వరకు విస్తరించింది. అయితే, ఇది ఇప్పటికీ ఒకే యూనిట్‌గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో మూడు వేర్వేరు స్క్రీన్‌లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టచ్‌స్క్రీన్ సిస్టమ్, ప్యాసింజర్ డిస్‌ప్లే కోసం ఒక్కో యూనిట్ ఉంది.
2025 మహీంద్రా లైక్ ఫీచర్లు..మహీంద్రా XUV.e9 ఇంజన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. అయితే, ఇది 80kWh బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని భావిస్తున్నారు. ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 450 కి.మీ.లు పొందనుంది.