Mahindra Bolero : ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు.. రూ.1.20లక్షలకే బొలెరోను కొనుగోలు చేయొచ్చు
Mahindra Bolero : మహీంద్రా కంపెనీ ఎస్‌యూవీలు, ఎంపీవీలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో అంటే నవంబర్‌లో మహింద్రా కార్లపై న్యూ ఇయర్ స్టాక్ క్లియరెన్స్ సేల్‌ను తీసుకొచ్చింది. వాహనాలపై ఆఫర్‌ల ప్రయోజనాలు డిసెంబర్ 31 వరకు లేదా కారు స్టాక్‌లో ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ప్రముఖ బొలేరో నియో కూడా డిస్కౌంట్ల జాబితాలో చేర్చారు. ఈ కారుపై రూ.70 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.30 వేలు యాక్సెసరీస్ తగ్గింపు, రూ.20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఈ విధంగా ఈ కారుపై మొత్తం రూ.1.20 లక్షల తగ్గింపు లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.94 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మహీంద్రా బొలెరో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
కొత్త మహీంద్రా బొలెరో నియో రూఫ్ స్కీ-రాక్, కొత్త ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు , డీప్ సిల్వర్ కలర్ స్కీమ్‌లో పూర్తి చేసిన స్పేర్ వీల్ కవర్ వంటి విజువల్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. క్యాబిన్ కూడా డ్యూయల్ టోన్ లెదర్ సీట్లతో అప్‌గ్రేడ్ చేశారు. ఇది డ్రైవర్ సీటు కోసం ఎత్తు సర్దుబాటు (సీట్ అడ్జస్టబుల్) చేసుకునే వీలుంది. సెంటర్ కన్సోల్‌లో సిల్వర్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి. మొదటి, రెండవ వరుస ప్రయాణీకులకు ఆర్మ్‌రెస్ట్ ఉంది.
దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ యూనిట్‌లో Apple CarPlay, Android Auto అందుబాటులో లేవు. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, మహీంద్రా బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్ , స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌తో వస్తుంది. స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ ఆప్షన్‌గా డ్రైవర్ సీట్ కింద అండర్ సీట్ స్టోరేజ్ ట్రే కూడా ఉంది.
ఈ SUVలో ఎలాంటి మెకానికల్ మార్పులు కనిపించవు. ఈ మోడల్ 1.5-లీటర్ mHawk 100 డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 100bhp శక్తిని, 260Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇంజన్‌తో వస్తోంది. సేప్టీ కోసం ఈ మూడు-వరుసల SUV ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రాష్ సెన్సార్‌లను అందుబాటులో ఉన్నాయి.