Lexus: ఇదేం కార్ భయ్యా.. 48 అంగుళాల స్కీన్‌తో రచ్చలేపే ఫీచర్లు.. ప్రీమియం ఎస్‌యూవీ ధర తెలిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!
Lexus LM 350H 48-అంగుళాల స్క్రీన్‌తో భారతదేశంలో రూ. 2 కోట్లకు ప్రారంభించబడింది
Lexus LM 350H: లెక్సస్ ఇండియా ఎట్టకేలకు LM 350Hని దేశంలో లాంచ్ చేసింది. దీని బుకింగ్‌లు గత ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి. అయితే, దాని ఏడు సీట్ల వేరియంట్ ధర రూ. 2 కోట్లుగా నిలిచింది. అయితే, నాలుగు సీట్ల అల్ట్రా లగ్జరీ వేరియంట్ ధర రూ. 2.5 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. ఈ కారు కేవలం ఒక నెలలోనే 100 బుకింగ్‌లను పొందింది.
ఫీచర్ల గురించి మాట్లాడితే, LM 350H రెండవ వరుసలో 48-అంగుళాల అల్ట్రావైడ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది తొలగించవచ్చు. ఇది అధునాతన ఇన్‌ఫ్రారెడ్ రే మ్యాట్రిక్స్ సెన్సార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఎయిర్‌లైన్-స్టైల్ రిక్లైనర్ సీట్లు, రెండవ వరుస ఒట్టోమన్ సీట్ల కోసం హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఫీచర్లను కూడా అందించారు.
లెక్సస్ LM 350h 2.5-లీటర్, నాలుగు-సిలిండర్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 190బిహెచ్‌పి పవర్, 240ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇ-ఫోర్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది.
ఈ సందర్భంగా లెక్సస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ, “అల్ట్రా లగ్జరీ మొబిలిటీలోకి అడుగుపెడుతున్న మాకు భారతదేశంలో సరికొత్త లెక్సస్ LM లాంచ్ చాలా ముఖ్యమైనది. గత సంవత్సరం దీని బుకింగ్‌లను ప్రకటించాం. ఆ తర్వాత ఈ కొత్త Lexus LM దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది' అంటూ చెప్పుకొచ్చారు.