Grand Vitara Dominion Edition: గ్రాండ్ విటారా యాక్సెసరీస్ వెర్షన్ లాంచ్.. ఈసారి ఫీచర్లు అదిరిపోయాయ్..!
Grand Vitara Dominion Edition: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా యాక్సెసరీస్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది.
Grand Vitara Dominion Edition: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా యాక్సెసరీస్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీనికి డొమినియన్ ఎడిషన్ అని పేరు పెట్టారు. తాజా వెర్షన్‌ను ఆల్ఫా, జీటా, డెల్టా వంటి మూడు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. మూడు వేరియంట్లలో వినియోగదారులు CNG, పెట్రోల్ ఇంజన్ల ఎంపికను పొందుతారు. కంపెనీ అధికారిక విడుదల ప్రకారం ఈ మోడల్‌పై కస్టమర్‌లు మరిన్ని ప్రయోజనాలను పొందేందుకు వీలుగా ముఖ్యంగా పండుగల సీజన్ కోసం తాజా వెర్షన్‌ను ప్రవేశపెట్టారు.
తాజా ఎడిషన్ మంచి కాంప్లిమెంటరీ యాక్సెసరీలతో వస్తుంది. యాక్సెసరీల జాబితాలో డోర్ వైజర్‌లు, రియర్ స్కిడ్ ప్లేట్, 3డి బూట్ మ్యాట్, ఆల్-వెదర్ మ్యాట్, సీట్ కవర్‌లు, సైడ్ స్టెప్స్, బాడీ కవర్, నెక్సా కుషన్, కార్ కేర్ కిట్, మరెన్నో ఉన్నాయి. ఆల్ఫా, జీటా ట్రిమ్‌లలో ఈ అప్లైన్స్ ధర రూ. 52,599, రూ. 49,999. లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీస్ ప్యాకేజీ అక్టోబర్ నెలలో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
కొత్తగా విడుదల చేసిన డొమినియన్ ఎడిషన్‌లో పవర్‌ట్రెయిన్ పరంగా ఎలాంటి మార్పు లేదు. దీనర్థం.. వినియోగదారులు 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ను కూడా పొందుతారు. ఇది గరిష్టంగా 102 bhp పవర్, 136.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVలో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
అదే ఇంజన్ దాని CNG వెర్షన్‌లో కూడా ఉంది. అయితే ఇది ఇంధన వెర్షన్ కంటే తక్కువ పవర్‌ని రిలీజ్ చేస్తుంది. యాక్సెసరీస్ ప్యాకేజీని జోడించినప్పటికీ కంపెనీ కారు ధరను పెంచలేదు. దీని ధర వేరియంట్‌పై ఆధారపడి రూ. 10.99 లక్షల నుండి రూ. 20.99 లక్షల (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) మధ్య ఉంచారు. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హై రైడర్, స్కోడా కుషాక్, టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్‌లతో పోటీపడుతుంది.