Komaki Flora: దిమ్మ తిరిగే ఫీచర్లతో దమ్మున్న స్కూటీ వచ్చేసిందోచ్.. ఫుల్ ఛార్జ్‌తో 100 కిమీల మైలేజీ.. ధర కూడా తక్కువే..!

Komaki Flora: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అందుకోసం వాహన తయారీ కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచి

Update: 2024-03-09 15:30 GMT

Komaki Flora: దిమ్మ తిరిగే ఫీచర్లతో దమ్మున్న స్కూటీ వచ్చేసిందోచ్.. ఫుల్ ఛార్జ్‌తో 100 కిమీల మైలేజీ.. ధర కూడా తక్కువే..!

Komaki Flora: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అందుకోసం వాహన తయారీ కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచి మేరకు ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కొమాకి తన ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లతో తిరిగి పరిచయం చేసింది.

ఈ కొత్త స్కూటర్ రూ.69,000 ధరతో పరిచయం చేసింది. కొత్త Komaki Flora ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లిథియం అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) వేరు చేయగలిగిన బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని మీరు మీ సౌలభ్యం ప్రకారం తీసివేయవచ్చు, ఛార్జ్ చేయవచ్చు.

అలాగే, ఈ బ్యాటరీ బరువు చాలా తేలికగా ఉంటుంది. ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జింగ్ చేయడం చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై 85 నుంచి 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు: అప్‌డేట్ చేసిన ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త డ్యాష్‌బోర్డ్, సెల్ఫ్ డయాగ్నస్టిక్ మీటర్, పార్కింగ్, క్రూయిజ్ కంట్రోల్స్‌తో పాటు బ్యాక్‌రెస్ట్, బూట్ స్పేస్‌తో కూడిన సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి.

ఫ్లోరా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆధునిక ఫీచర్లతో వస్తుంది.

ఇది కాకుండా, కంపెనీ కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హీట్ ప్రూఫ్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది అగ్ని ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఇ-స్కూటర్ రోజువారీ ఉపయోగం కోసం రూపొందించబడింది.

కొత్త కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ రంగు ఎంపికల గురించి మాట్లాడుతూ, ఇది నాలుగు రంగులలో (జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే, శాక్రమెంటో గ్రీన్) పరిచయం చేసింది. ఈ ఇ-స్కూటర్ స్టీల్ ఛాసిస్‌తో తయారు చేసింది. దాని బాడీ చాలా బలంగా ఉంది.

ఫ్లోరా రీ-లాంచ్ గురించి మాట్లాడితే, కోమాకి ఎలక్ట్రిక్ డివిజనల్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, "మా అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లోరా పునఃప్రారంభం దేశంలో గ్రీన్ మొబిలిటీలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

“మేం స్థిరమైన రవాణాలో నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహిస్తున్నందున, ఫ్లోరా EV స్కూటర్ మోడల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును పునర్నిర్వచించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును కూడా ఇది అవగాహన కల్పిస్తుందని మేం నమ్ముతున్నాం" అంటూ తెలిపాడు.

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఓలా, ఈథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడల్స్ అధిక డిమాండ్‌తో ముందున్నాయి. ఇటీవలే రీలాంచ్ అయిన కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ స్కూటర్ ఎంత వరకు ఆదరణ పొందుతుందో చూడాలి.

Tags:    

Similar News